AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mars: అంగారకుడిపై వింత రాయి.. ఇది ఎక్కడి నుండి వచ్చింది ??

Mars: అంగారకుడిపై వింత రాయి.. ఇది ఎక్కడి నుండి వచ్చింది ??

Phani CH
|

Updated on: Nov 21, 2025 | 1:49 PM

Share

అంగారక గ్రహంపై నాసా పర్సెవరెన్స్ రోవర్ "ఫిప్సాక్స్‌లా" అనే వింతరాయిని జెజెరో క్రేటర్ సమీపంలో గుర్తించింది. ఈ 80 సెం.మీ. రాయిలో అధిక ఇనుము, నికెల్ మూలకాలు ఉండటంతో, ఇది గ్రహశకలం నుండి వచ్చిన ఉల్క అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా అంగారక ఉపరితలంపై ఇవి అరుదు. ఈ ఆవిష్కరణ మార్స్ గతానికి కొత్త Einblicke ఇస్తుంది.

అంగారక గ్రహంపై ఓ వింతరాయిని గుర్తించారు శాస్త్రవేత్తలు. గతంలో అక్కడకు పంపిన పర్సెవరెన్స్ రోవర్ ఈ వింత బండరాయిని గుర్తించింది. జెజెరో క్రేటర్ సమీపంలోని వెర్నోడెన్ అనే ప్రాంతంలో దీనిని గుర్తించారు. అక్కడి పరిసరాలకు, అక్కడ కనిపించిన ఈ 80 సెంటీమీటర్ల రాయి తీరు లక్షణాలకు ఎక్కడా పొంతన లేకపోవటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఈ రాయికి “ఫిప్సాక్స్‌లా” అని నాసా పేరు పెట్టింది. సెప్టెంబర్ 19, 2025న రోవర్‌లోని మాస్ట్‌క్యామ్-జెడ్ కెమెరా ఈ చిత్రాన్ని తీసింది. గత వారం శాస్త్రవేత్తల బృందం ఈ రాయిని మరింత నిశితంగా పరిశీలించింది. ఆ రాయి ఆకారం, పరిమాణం చుట్టుపక్కల ప్రాంతంలోని రాళ్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయని నిర్ధారించింది. రోవర్‌లోని సూపర్‌క్యామ్ లేజర్, స్పెక్ట్రోమీటర్లతో జరిపిన ప్రాథమిక విశ్లేషణలో… ఈ రాయిలో ఇనుము, నికెల్ మూలకాలు అధిక సాంద్రతలో ఉన్నట్లు తేలింది. సాధారణంగా అంగారకుడి ఉపరితలంపై ఈ మూలకాలు అరుదుగా కనిపిస్తాయి. గ్రహశకలాల కేంద్ర భాగాల్లో ఏర్పడే ఐరన్-నికెల్ ఉల్కలలో ఇవి అధికంగా ఉంటాయి. దీన్ని బట్టి ఈ రాయి సౌర వ్యవస్థలో మరెక్కడో ఏర్పడి, అంగారకుడిపై పడి ఉండవచ్చని నాసా భావిస్తోంది. అయితే, దీన్ని ఉల్కగా అధికారికంగా నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని నాసా తెలిపింది. గతంలో క్యూరియాసిటీ రోవర్ 2014లో “లెబనాన్”, 2023లో “కోకో” అనే ఐరన్-నికెల్ ఉల్కలను గేల్ క్రేటర్‌లో గుర్తించింది. జెజెరో క్రేటర్ వద్ద పర్సెవరెన్స్‌కు ఇన్నాళ్లకు ఇలాంటి రాయి కనబడటం శాస్త్రవేత్తలకు ఊహించని పరిణామంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూతురిని ఇంట్లో బంధించి.. నరకం చూపిన తల్లి.. అమ్మ ఇలా కూడా చేస్తుందా !!

వాకింగ్ కు వెళ్లిన గర్భిణి.. మృత్యు రూపంలో దూసుకొచ్చిన కారు..

Anchor Suma: రిటైర్మెంట్ పై సుమ షాకింగ్ కామెంట్స్.. ఆ వర్గానికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా

నవంబర్‌ మొత్తం.. చల్ల చల్లని కూల్‌కూల్‌

Sabarimala: భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం