AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురిని ఇంట్లో బంధించి.. నరకం చూపిన తల్లి.. అమ్మ ఇలా కూడా చేస్తుందా !!

కూతురిని ఇంట్లో బంధించి.. నరకం చూపిన తల్లి.. అమ్మ ఇలా కూడా చేస్తుందా !!

Phani CH
|

Updated on: Nov 21, 2025 | 1:43 PM

Share

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఓ బాలికను తల్లి రెండేళ్లు నిర్బంధించింది. రజస్వల అయిన తర్వాత కూతురు సమాజం బారిన పడుతుందనే భయంతో, మానసిక అనారోగ్యంతో తల్లి ఈ చర్యకు పాల్పడింది. చదువు దూరం, చీకట్లో జీవనం. చివరకు అంగన్‌వాడీ, ఐసీడీఎస్ అధికారుల చొరవతో బాలికకు విముక్తి లభించింది. తల్లికి చికిత్స, బాలికకు ఆశ్రయం కల్పించారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఓ బాలిక 9వ తరగతి వరకూ చదివింది. పదవ క్లాస్‌ పూర్తి చేసి.. ఇంటర్‌లో చేరాలని ఆశపడింది. తొమ్మిదో తరగతి పూర్తికాగానే ఆ బాలిక రజస్వల అయింది. దీంతో బాలిక తల్లికి భయం పట్టుకుంది. బిడ్డను బయటకు పంపిస్తే ఈ సమాజం ఏమైనా చేస్తుందేమోననే ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. నాటి నుంచి బాలికను ఇంట్లో నుంచి కదలనివ్వలేదు. నువ్వు బయటకు వెళ్తే ఎవరైనా ఏదైనా చేస్తారని కూతురికి కూడా భయం నూరిపోసింది. తండ్రి లేకపోవడం… తల్లికి ఎదురు చెప్పలేకపోవడం… తనూ భయపడటంతో బాలిక రెండేళ్లుగా ఇంట్లోనే మగ్గిపోయింది. చివరికి అధికారుల చొరవతో విడుదలైంది. ఇచ్ఛాపురం వాసి.. భాగ్యలక్ష్మికి ఒడిశా వాసి నరసింహరాజుతో 2007లో వివాహమైంది. కాన్పుకు ఇచ్ఛాపురంలోని పుట్టింటికి వచ్చిన భాగ్యలక్ష్మి అక్కడే ఉండిపోయింది. తర్వాత భర్త కూడా మరణించటంతో కూతురు మౌనికతో కలిసి.. ఇక్కడే స్థిరపడింది. ప్రస్తుతం మౌనిక ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతోంది. పెద్దమనిషయ్యాక మౌనికను తల్లి చదువు మాన్పించింది. ఈ విషయమై ఎవరు అడిగినా .. భాగ్యలక్ష్మి వారిపై విరుచుకుపడేది. దీంతో బంధువులు, ఇరుగుపొరుగు వారు ఆ విషయం పట్టించుకోవడం మానేశారు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు భాగ్యలక్ష్మి..తన కుమార్తెను ఇంట్లో నుంచి బయటకు రాకుండా లోపలే పెట్టి తాళం వేసేది. అలాగే, ఇంటి ఫీజును తీసేసి.. ఇంటికి కరెంటు సరఫరా రాకుండా చేసింది. దీంతో తల్లీకుమార్తె చీకటిలోనే మగ్గుతున్నారు. అయితే..భాగ్యలక్ష్మి తీరు గురించి స్థానిక అంగన్ వాడీ కార్యకర్తకు కొంత సమాచారం అందింది. ఇంట్లో ఇద్దరు ఉండగా… కూతురు ఎప్పుడూ కనిపించకపోవటంతో ఆమె ఐసీడీఎస్‌ పీవో రాజేశ్వరికి ఫిర్యాదు చేశారు. దీంతో మండల తహసీల్దార్‌.. పోలీసులతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లారు. భాగ్యలక్ష్మికి నచ్చజెప్పి.. మౌనికను బయటకు తీసుకొచ్చారు. బాలికకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూస్తామని… అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పి ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న భాగ్యలక్ష్మిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మౌనికను శ్రీకాకుళం బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాకింగ్ కు వెళ్లిన గర్భిణి.. మృత్యు రూపంలో దూసుకొచ్చిన కారు..

Anchor Suma: రిటైర్మెంట్ పై సుమ షాకింగ్ కామెంట్స్.. ఆ వర్గానికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా

నవంబర్‌ మొత్తం.. చల్ల చల్లని కూల్‌కూల్‌

Sabarimala: భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం

Cyclone Alert: దూసుకొస్తున్న మరో తుఫాన్‌ వాతావరణశాఖ పిడుగులాంటి వార్త