MSI Laptops: అధిక పనితీరు.. అద్భుత ఫీచర్లు.. ఎంఎస్‌ఐ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌లు..
ఎంఎస్ఐ కంపెనీ తన కొత్త క్లాగేమింగ్ హ్యాండ్ హెల్డ్ పరికరంతో పాటు ఏఐ ఆధారిత ల్యాప్ టాప్ లను మన దేశ మార్కెట్ లోకి విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ. 68,990గా నిర్ణయించింది. ల్యాప్ టాప్ లలో ఆల్ బేసిడ్ సాఫ్ట్ వేర్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. అప్లికేషన్ ఆధారంగా పనిచేసే ఆటోమెడికల్లీ ఆప్టమైజ్ ల్యాప్ టాప్ సెట్టింగ్ లు కూడా ఉన్నాయి. కంటెంట్ క్రియేటర్స్ కోసం మరికొన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
నేడు ప్రతి ఒక్కరికీ ల్యాప్ టాప్ అనివార్యంగా మారింది. చదువుకునే పిల్లలతో పాటు ఉద్యోగులు, వ్యాపారులు కూడా తమ అవసరాలకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు అనేక రకాల మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. దేశ మార్కెట్ ను రకరకాల మోడళ్ల ల్యాప్ టాప్ లు ముంచెత్తుతున్నాయి. వినియోగదారుల అవసరాల మేరకు వివిధ రకాల ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఎంఎస్ఐ కంపెనీ నుంచి గేమింగ్ పరికరాలు, ల్యాప్ టాప్ లు మార్కెట్ లోకి వచ్చాయి. వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలను తెలుసుకుందాం.
కొత్త సాఫ్ట్ వేర్, ఫీచర్లు..
ఎంఎస్ఐ కంపెనీ తన కొత్త క్లాగేమింగ్ హ్యాండ్ హెల్డ్ పరికరంతో పాటు ఏఐ ఆధారిత ల్యాప్ టాప్ లను మన దేశ మార్కెట్ లోకి విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ. 68,990గా నిర్ణయించింది. ల్యాప్ టాప్ లలో ఆల్ బేసిడ్ సాఫ్ట్ వేర్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. అప్లికేషన్ ఆధారంగా పనిచేసే ఆటోమెడికల్లీ ఆప్టమైజ్ ల్యాప్ టాప్ సెట్టింగ్ లు కూడా ఉన్నాయి. కంటెంట్ క్రియేటర్స్ కోసం మరికొన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇమేజ్ టు ఇమేజ్ ఫీచర్లు, పీఎస్డీ ఫైల్ ఎక్స్ పోర్ట్, అలాగే ఆఫ్ లైన్ టెక్ట్స్ టు ఇమేజ్ సర్వీసు అందుబాటులో ఉంది. అల్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రోగ్రామ్ దీనికి అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. అధునాతన మైక్రోఫోన్ హార్డ్ వేర్ ను విలీనం చేయడానికి నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతో సహాయపడుతుంది.
ఎన్నో ప్రత్యేకతలు..
ఎమ్ఎస్ఐ క్లా హ్యాండ్ హెల్డ్ గేమింగ్ పరికరం ప్రత్యేకతలను తెలుసుకుందాం. ఇది 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, ఏడు అంగుళాల ఎఫ్ హెచ్ డీ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంది. దీనిలోని ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ 155 హెచ్ వరకూ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్‌లతో పనిచేస్తుంది. ఇంటెల్ ఎక్స్ఈఎస్ఎస్ సాంకేతికతను కలిగిన ఈ పరికరం ఒక్క సెకన్ కే ఫ్రేమ్‌రేట్‌లను (ఎఫ్ పీఎస్) మెరుగుపరుస్తుంది. కూలర్ బూస్ట్ హైపర్‌ఫ్లో థర్మల్ టెక్‌ని కలిగి ఉండడంతో గేమింగ్ సమయంలో వేడిని వెదజల్లడానికి సహాయపడుతుంది. ఇక మిగిలిన విషయాల్లోకి వెళితే ఇది విండోస్ 11 ప్రో ఓఎస్ పై పనిచేస్తుంది. ఎంఎస్ఐ ఏపీపీ ప్లేయర్‌ను కలిగి ఉంది, ఇందులో ఆండ్రాయిడ్ మొబైల్ గేమ్‌లకు యాక్సెస్ ఉంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్ 135 హెచ్ ఉన్న మోడల్ రూ.88,990కు అందుబాటులో ఉంది.
18 అంగుళాల గేమింగ్ ల్యాప్ టాప్ లు..
ఎమ్ఎస్ఐ కంపెనీ కొత్తగా 18 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్‌లను కూడా పరిచయం చేసింది. వాటిని టైటాన్ 18 హెచ్ఎక్స్, రైడర్ 18 హెచ్ఎక్స్ పేర్లతో విడుదల చేసింది. ఇవి ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్ 14900 హెచ్ఎక్స్ ప్రాసెసర్, ఎన్ వీఐడీఏ గీఫోర్స్ ఆర్ టీఎక్స్ 4090 జీపీయూ గ్రాఫిక్స్ ద్వారా పవర్ ను పొందుతాయి. సరికొత్త ఇంటెల్ కోర్ అల్ట్రా 9 185 హెచ్ ప్రాసెసర్‌లతో స్టెల్త్ 18 ఏఐ స్టూడియో రన్ అవుతుంది. మిగిలిన ప్రత్యేకతలను తెలుసుకుంటే.. ఇవి 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 16:10 యాస్పెక్ట్ రేషియోతో 18 అంగుళాల యూహెచ్ డీ+ మినీలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. టైటాన్ 18 హెచ్‌ఎక్స్ ల్యాప్ టాప్ లో అదనంగా ఒక కూలర్ థర్మల్ సిస్టమ్ ఉంది. ఇది 270వాట్ల పవర్, రైడర్ 18 హెచ్‌ఎక్స్ ల్యాప్ టాప్ 250వాట్ల పవర్‌కు సపోర్టు చేస్తాయి. చివరిగా ధరల విషయానికి వస్తే టైటాన్ మోడల్ ధర రూ. 4,99,990 నుంచి మొదలవుతుంది. రైడర్ జీఈ68 హెచ్ఎక్స్ 14 హెచ్ జీ ల్యాప్ టాప్ రూ. 2,99,990లకు అందుబాటులో ఉంది.
ప్రెస్టీజ్ ఏఐ సిరీస్..
ఈ కంపెనీ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 185హెచ్ ప్రాసెసర్‌తో ఆధారితమైన తన కొత్త ప్రెస్టీజ్ ఏఐ సిరీస్ ల్యాప్ టాప్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మనం ఎంచుకున్న కాన్ఫిగరేషన్‌ను బట్టి వీటి ధర గరిష్టంగా రూ. 2,21,990 వరకూ ఉంటుంది. వీటిలో కూడా ఆకట్టుకునే ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రెస్టీజ్ 16 ఏఐ ల్యాప్ టాప్ విషయానికి వస్తే అల్ట్రాలైట్ (1.5 కేజీల బరువు) మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రమంతో ఉంది. 99.9 WHr బ్యాటరీ కారణంగా చార్జింగ్ ఎక్కువ సమయం నిలుస్తుంది. అలాగే ప్రెస్టీజ్ 14 లేఐ 14 ల్యాప్ టాప్ అతి పెద్ద బ్యాటరీని (90 గంటలు) కలిగి ఉంది. యూహెచ్ డీ+ రిజల్యూషన్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో, పీడీ 3.1 140వాట్ల ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
స్వోర్డ్ 16/17 హెచ్ ఎక్స్..
ఎంఎస్ఐ కంపెనీ రూపొందించిన కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లలో స్వోర్డ్ 16/17 హెచ్ ఎక్స్ గురించి తెలుసుకుందాం.. దీని స్పేస్ గ్రే డిజైన్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిని పీసీఆర్ మెటీరియల్ నుంచి తయారు చేశారు. ఈ ల్యాప్ టాప్ 24-జోన్ ఆర్ జీబీ బ్యాక్‌లిట్ కీబోర్డ్, 16/17 అంగుళాల 240 హెచ్ జెడ్ ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ 14700హెచ్ ఎక్స్, ఆర్ టీఎక్స్ 4070 జీపీయూ ద్వారా రూపొందించారు. ఈ సిరీస్ మోడళ్లు రూ. 1,39,990 నుంచి ప్రారంభమవుతాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..