OnePlus Nord: వన్‌ప్లస్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ ఇంకెప్పుడు రాదు..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 21,999కాగా 10 శాతం డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు. అదనంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఐసీఐసీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే...
ఒకప్పుడు కేవలం పండగల సీజన్‌లోనే ఈకామర్స్ సైట్స్ స్మార్ట్ ఫోన్‌లపై ఆఫర్లను ప్రకటించేవి. కానీ ప్రస్తుతం సందర్భంతో సంబంధం లేకుండా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీసీ3 లైట్ 5జీ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్ ఏంటి.? ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 21,999కాగా 10 శాతం డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు. అదనంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఐసీఐసీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో బుక్ చేస్తే రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇలా అన్ని ఆఫర్లు కలిపితే ఈ ఫోన్‌ను రూ.18,499కే సొంతం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే వీటితో పాటు ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సైతం అందస్తున్నారు. మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా భారీ డిస్కౌంట్ పొందొచ్చు. పాత ఫోన్ కండిషన్ ఆధారంగా గరిష్టంగా రూ. 18,950 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఈ లెక్కన ఒకవేళ మీ పాత ఫోన్‌కు పూర్తి స్థాయిలో ఎక్స్చేంజ్ లభిస్తే ఈ ఫోన్‌ను కేవలం రూ. 1,049కే సొంతం చేసుకోవచ్చు. మరి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 5జీ, 4జీ, ఎల్‌టీఈ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఇక ఆక్సిజన్ ఓఎస్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..