Vivo Y03: మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్.. రూ. 7వేలకే సూపర్ ఫీచర్స్..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా వివో వై03 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను ఇండోనేషియాలో లాంచ్ చేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే ఈ ఫోన్ ధర రూ. 6,900గా ఉండనుంది. ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకురానున్నారు. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్...
అటు ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌తో పాటు ఇటు బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో. ఇప్పటికే పలు బడ్జెట్ ఫోన్‌లను తీసుకొచ్చిన వివో.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ. 7 వేలలోనే ఈ ఫోన్‌ను తీసుకొచచారు. ప్రస్తుతం ఇండోనేషియాలో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా వివో వై03 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను ఇండోనేషియాలో లాంచ్ చేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే ఈ ఫోన్ ధర రూ. 6,900గా ఉండనుంది. ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకురానున్నారు. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8వేలుగా ఉండనుంది. భారత్‌లో ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నదానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయాలేదు.
ఇక వివో వై03 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పిక్సెల్ డెన్సిటీ 269 పీపీఐగా అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 4జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే వివో వై03 స్మార్ట్ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిస్తారు.
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఫోన్‌కు సైడ్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఈ ఫోన్ మందం 0.83 సెంటీమీర్లు కాగా బరువు 185 గ్రాములుగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను వివో వై02 స్మార్ట్ ఫోన్‌కి కొనసాగింపుగా తీసుకొచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..