AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI: ఇలా అయితే ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎలా.? సంచలనంగా మారిన ‘డెవిన్’..

అయితే ప్రస్తుతానికి ఏఐ రంగం డేటా సెర్చ్‌, ఫొటోలు డిజైనింగ్ వరకు మాత్రమే పరిమితమైంది. అయితే రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ఏకంగా వెబ్‌సైట్స్‌ను, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో రాసేలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేస్తోంది. అమెరికాకు చెందిన కాగ్నిషన్‌ అనే స్టార్టప్‌ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌’ను సృష్టించింది...

AI: ఇలా అయితే ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎలా.? సంచలనంగా మారిన 'డెవిన్'..
Ai Devin
Narender Vaitla
|

Updated on: Mar 16, 2024 | 10:26 AM

Share

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రంగంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఏఐ టెక్నాలజీతో భారీగా ఉద్యోగాల కోత తప్పదని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. అయితే ఏఐ రాకతో మరిన్ని ఉద్యోగాలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల కోత ఉండదని మరికొందరు చెబుతున్నారు.

అయితే ప్రస్తుతానికి ఏఐ రంగం డేటా సెర్చ్‌, ఫొటోలు డిజైనింగ్ వరకు మాత్రమే పరిమితమైంది. అయితే రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ఏకంగా వెబ్‌సైట్స్‌ను, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో రాసేలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేస్తోంది. అమెరికాకు చెందిన కాగ్నిషన్‌ అనే స్టార్టప్‌ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌’ను సృష్టించింది. దానికి ‘డెవిన్‌’ అని నామకరణం చేశారు. ఇది వెబ్‌సైట్లను, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లను రూపొందించిగలదని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఇంటర్వ్యూలను, వివిధ బెంచ్‌మార్క్‌ టెస్టులను విజయవంతంగా పాస్‌ అయిందని కంపెనీ తెలిపింది.

ఈ టెక్నాలజీతో సాఫ్ట్‌వేర్‌ కోడింగ్ రాయడం నుంచి మొదలు టెస్టింగ్, డీబగ్గింగ్‌ వరకు సుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చేసే మొత్తం పనిని ఈ డెవిన్‌ చేసి పెట్టగలదని కాగ్నిషన్‌ కంపెనీ చెబుతోంది. చిన్న కమాండ్‌తోనే ఈ పనంతా చేసి పెడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా కోడింగ్ విషయంలో తాను చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే సామర్థ్యం కూడా ఈ టెక్నాలజీకి ఉందని కాగ్నిషన్‌ కంపనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్కాట్ తెలిపారు.

అయితే ఈ డెవిన్‌ను పూర్తి స్థాయిలో ‘ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌’గా వినియోగించాలన్నది తమ ఉద్దేశం కాదని కంపెనీ తెలపడం గమనార్హం. ఏది ఏమైనా ఏఐ టెక్నాలజీతో భారీ ఎత్తున ఉద్యోగాలు పోతాయన్న వార్తలకు ఇది బలం చేకూర్చినట్లైంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?