Motorola Edge 40: మోటోరోలా ఫోన్‌పై రూ. 5,700వరకూ తగ్గింపు.. స్లిమ్ అండ్ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్.. అవకాశం వదలొద్దు..
అనువైన బడ్జెట్లో లభించే మోటో జీ54 స్మార్ట్ ఫోన్ ధరను మరింత చవకగా మార్చింది. ఇప్పుడు మరో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్40పై భారీ తగ్గింపును ప్రకటించింది. దాదాపు రూ. 3000 వరకూ ధరను కట్ చేసింది. అంతేకాక పలు బ్యాంకు క్రెడిట్‌కార్డులపై పది శాతం ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ క్రమంలో మోటోరోలా ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ప్రస్తుత ధర, డిస్కౌంట్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మోటోరోలా స్మార్ట్ ఫోన్లకు మన దేశీయ సెల్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల కాలంలో ఈ బ్రాండ్ ఫోన్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. అందుకనుగుణంగా కంపెనీ కూడా మంచి పలు ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారుల అటెన్షన్‌ను తన వైపు తిప్పుకుంటోంది. ఇదే క్రమంలో అనువైన బడ్జెట్లోనే లభించే మోటో జీ54 స్మార్ట్ ఫోన్ ధరను మరింత చవకగా మార్చింది. ఇప్పుడు మరో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్40పై భారీ తగ్గింపును ప్రకటించింది. దాదాపు రూ. 3000 వరకూ ధరను కట్ చేసింది. అంతేకాక పలు బ్యాంకు క్రెడిట్‌కార్డులపై పది శాతం ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ క్రమంలో మోటోరోలా ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ప్రస్తుత ధర, డిస్కౌంట్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మోటోరోలా ఎడ్జ్ 40 ప్రస్తుత ధర ఇలా..
మోటోరోలా ఎడ్జ్40 స్మార్ట్ ఫోన్ గతేడాది మేలో లాంచ్ అయ్యింది. ఆ సమయంలో దీని ధర రూ. 29,999గా ఉంది. ఇప్పుడు దీని ధరను కంపెనీ రూ. 3,000 తగ్గించింది. అంటే ప్రస్తుతం దీనిని రూ. 26,999కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మెజెంతా, ఎక్లిప్స్ బ్లాక్, నెబ్యూలా గ్రీన్, లూనార్ బ్లూ రంగుల్లో ఎంపిక చేసుకోవచ్చు. పై డిస్కౌంట్ మాత్రమే కాక పలు బ్యాంకు కార్డులపై పది శాతం క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులను వినియోగించి కొనుగోలు చేస్తే దీనిని కేవలం రూ. 24,300కి కొనుగోలు చేయొచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 40 స్పెసిఫికేషన్లు..
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.55 ఫుల్‌హెచ్‌డీ ప్లస్ పీఓఎల్‌ఈడీ డిస్ ప్లే ఉంటుంది. 144హెర్జ్ రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్‌నెస్ 1200నిట్స్ వరకూ ఇస్తుంది. ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్ నుంచి శక్తిని పొందుతుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఎల్‌ఈడీ ఫ్లాస్ ఉంటాయి. ముందు వైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఆడియో కోసం ప్రత్యేకంగా డాల్బీ ఆట్మోస్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మూడు మైక్రోఫోన్స్ ఉంటాయి. ఐపీ68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌తో వస్తుంది. అదే విధంగా బ్యాటరీ విషయానికి వస్తే 4,600ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. 68వాట్ల టర్బో ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంటుంది. అలాగే 15వాట్ల సామర్థ్యంతో వైర్‌లెస్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








