Google Analytics: వెబ్‌సైట్లకు జీరో యూజర్లు.. గందరగోళంలో సైట్‌ ఓనర్స్‌. అసలేం జరిగిందంటే..

Google Analytics: ఇంటర్‌నెట్‌ వినియోగం పెరిగినప్పటి నుంచి వందల సంఖ్యలో వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఇంటర్‌నెట్ వినియోగదారులు పెరగడంతో కొత్త కొత్త వెబ్‌సైట్లు వస్తున్నాయి. మరి ఏ వెబ్‌సైట్‌ను ఎక్కువగా..

Google Analytics: వెబ్‌సైట్లకు జీరో యూజర్లు.. గందరగోళంలో సైట్‌ ఓనర్స్‌. అసలేం జరిగిందంటే..
Google Analytics
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 19, 2021 | 6:27 AM

Google Analytics: ఇంటర్‌నెట్‌ వినియోగం పెరిగినప్పటి నుంచి వందల సంఖ్యలో వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఇంటర్‌నెట్ వినియోగదారులు పెరగడంతో కొత్త కొత్త వెబ్‌సైట్లు వస్తున్నాయి. మరి ఏ వెబ్‌సైట్‌ను ఎక్కువగా ఎవరు చూస్తున్నారు లాంటి వివరాలు ఎలా తెలుసుకోవాలి.? ఇందుకోసమే ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌.. ‘గూగుల్‌ అనలిటిక్స్‌’ పేరుతో ఓ టూల్‌ను రూపొందించింది. ఈ టూల్‌ సహాయంతో యూజర్ల వివరాలు తెలుసుకోవచ్చు. అయితే సోమవారం ఈ టూల్‌ యూజర్లను ఒక్కసారి గందరగోళానికి గురి చేసింది. గూగుల్‌ అనలిటిక్స్‌ ఒక్కసారిగా డౌన్‌ కావడంతో రియల్‌ టైం వ్యూస్‌ సున్నాకు చేరుకున్నాయి.

దీంతో కొంత మంది యూజర్లు గందరగోళానికి గురయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలుపుతూ పలు పోస్టులు చేశారు. అయితే గూగుల్‌ ఈ విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సమస్యను కేవలం కొంత మంది యూజర్లు మాత్రమే ఎదుర్కున్నారు. అసలు గూగుల్‌ అనలిటిక్స్‌ ఉపయోగమేంటనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఈ టూల్‌ సహాయంతో యూజర్‌ తమ వెబ్‌ సైట్‌లో ఎంత సేపు ఉంటున్నారు.? ఎలాంటి కంటెంట్‌ను చూస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని ఆధారంగా తమ వెబ్‌ సైట్‌ను ఎలా మెరుగుదిద్దుకోవాలన్న ప్రణాళికలు వేసుకుంటారు. అంతేకాకుండా వెబ్‌ సైట్లకు వచ్చే ప్రకటనలు కూడా ఈ గూగుల్‌ అనలిటిక్స్‌ ఇచ్చే రిపోర్ట్‌ ఆధారంగా లెక్కకడతారు.

Also Read: Zodiac Signs: ఈ మూడు రాశుల వారు ఎప్పుడూ గట్టి పోటీ ఇస్తారు.. ఏ ఏ రాశుల వారంటే..

Pragya Jaiswal: ఆనందంలో తడిసి ముద్దవుతోన్న అందాల ప్రగ్యా.. ఇంతకీ ఈ బ్యూటీ సంతోషానికి కారణమేంటో తెలుసా?

Custard Apple Farming: సీతాఫలం సాగుతో అధిక లాభాలు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..