AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Phone: సెల్‌ఫోన్ పోయిందా.. ఇక ఆందోళన చెందకుండా ఇట్టే పట్టేయండి.. ఎలాగంటే

ప్రతిరోజు ఎక్కడో ఓ చోట సెల్‌ఫోన్లు చోరీలు జరిగిన ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తమ ఫోన్ పోతే అందులో ఉండే సమాచారమంతా దక్కకుండా పోతుందని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఈ రోజుల్లో ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, బ్యాంకింగ్ ఇలా అన్నింటినీ సెల్‌ఫోన్ నుంచే నిర్వహిస్తున్నారు. కరోనా తర్వాక డేటా వినియోగం పెరగడంతో విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు స్మార్ట్‌ఫోన్ వాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

Mobile Phone: సెల్‌ఫోన్ పోయిందా.. ఇక ఆందోళన చెందకుండా ఇట్టే పట్టేయండి.. ఎలాగంటే
Mobile Phone
Aravind B
|

Updated on: Apr 22, 2023 | 9:55 AM

Share

ప్రతిరోజు ఎక్కడో ఓ చోట సెల్‌ఫోన్లు చోరీలు జరిగిన ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తమ ఫోన్ పోతే అందులో ఉండే సమాచారమంతా దక్కకుండా పోతుందని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఈ రోజుల్లో ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, బ్యాంకింగ్ ఇలా అన్నింటినీ సెల్‌ఫోన్ నుంచే నిర్వహిస్తున్నారు. కరోనా తర్వాక డేటా వినియోగం పెరగడంతో విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు స్మార్ట్‌ఫోన్ వాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఫోన్‌ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా పరిస్థితి ఏంటి?. ఒకవేళ అందులోనుంచి డేటా చోరీకి గురైనా పలు సున్నితమైన విషయాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇకపై అలాంటి సమస్యలు లేకుండా రాష్ట్ర పోలీస్‌ శాఖ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ విధానంపై మంగళవారం నల్లగొండ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.

ఒకవేళ సెల్‌ఫోన్‌ పోతే దాన్ని ఎలా గుర్తించాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన CEIR(CENTRAL EQUIPMENT IDENTITY REGISTER) సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పోయిన సెల్‌ఫోన్‌ను తిరిగి కనిపెట్టే సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీన్ని ఉపయోగించి సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి బ్లాక్‌ చేయవచ్చు. సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెల్‌ఫోన్‌ను ఐఎంఈఐ నంబర్‌‌తో బ్లాక్‌ చేయవచ్చు. ఆ తర్వాత ఆ సెల్‌ఫోన్‌ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. ఒకవేళ ఫోన్‌ ఆన్‌చేసి అందులో సిమ్‌ తీసి కొత్త సిమ్‌ వేసినా ఆ విషయం ఫోన్‌ యజమానికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

1. సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న వెంటనే https://www.ceir.gov.in పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి. అందులో బ్లాక్‌ ఫోన్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

2. మొబైల్‌ నంబర్‌-1, మొబైల్‌ నంబర్‌-2, ఫోన్‌ బ్రాండ్‌, మోడల్‌, ఇన్వాయిస్‌(బిల్‌)ఫొటో సూచించిన గడుల్లో నింపాలి.

3. పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, ఇతర చిరునామాలు, అంతకుముందే ఇచ్చిన పోలీస్‌ కంప్లయింట్‌ నంబర్‌, ఫోన్‌ యజమాని చిరునామా, ఈ మెయిల్‌ ఐడీ, ధ్రువీకరణ కార్డులు, ఇలా వీటన్నింటిని సూచించిన బాక్సుల్లో నింపాలి.

3. వెంటనే మీ సెల్‌ఫోన్‌ పాత నంబర్‌ మీద తీసుకున్న కొత్త సిమ్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.

4. ఆ ఓటీపీని ఎంటర్‌ చేసిన తర్వాత ఫామ్‌ను సబ్‌మిట్‌ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌ దానంతట అదే బ్లాక్‌ అవుతుంది. ఇక నుంచి దాన్ని ఎవరూ ఆపరేట్‌ చేయలేరు. అందులో ఉన్న డేటా మొత్తం సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ ఫోన్‌ దొంగిలించిన వ్యక్తి లేదా సెకండ్‌ హ్యాండ్‌లో కొన్న వ్యక్తి సిమ్‌ వేయగానే మీ నంబర్‌కు మెసేజ్‌ వస్తుంది.

5. ఆ సందేశం ఆధారంగా ఫోన్‌ ఎక్కడ ఉన్నా పట్టుకోవడం సులభతరం అవుతుంది.

6. మీ సెల్‌ఫోన్‌ను పోలీసులు పట్టుకున్నా.. లేక మీకే దొరికినా.. మీ పాత ఐడీ, ఫోన్‌ నంబర్‌, ఇతర వివరాలు నింపిన తర్వాత ఫోన్‌ను ఆన్‌బ్లాక్‌ చేసుకోవచ్చు.

బ్లాక్‌ చేయండి ఇలా..

1. మీరు సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ లేదా ఓఎల్‌ఎక్స్‌ తదితర వెబ్‌సైట్‌లో లేదా తెలిసిన వారి దగ్గర ఫోన్‌ కొనాల్సి వచ్చినప్పుడు అది దొంగిలించిందా లేదా బ్లాక్‌లిస్టులో ఉందా? అనే విషయం మనం కేవైఎం(నో యువర్‌ మొబైల్‌) విధానం ద్వారా ముందే తెలుసుకోవచ్చు.

2. ఇందుకోసం మొబైల్‌ తీసుకుని కేవైఎం విధానంలోనూ ఐఎంఈఐ నంబర్‌ను తెలుసుకోవచ్చు. అందుకోసం కేవైఎం అని పెద్ద అక్షరాల్లో టైప్‌ చేయాలి. అనంతరం 15 అక్షరాల ఐఏఈఐ నంబర్‌ను టైప్‌ చేసి 14422 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపాలి.

3. ఇందుకోసం కేవైఎం యాప్‌ను సైతం డైన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్‌ , ఐఓఎస్‌ మొబైల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. లేదా సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌లోనూ ఆఖరిగా ఇచ్చిన ఆప్షన్‌ ద్వారా కూడా ఫోన్‌ను తనిఖీ చేసుకోవచ్చు.

4. ఒకవేళ మీరు ఫోన్‌ పోగొట్టుకున్నారు. ఒకవేళ ఐఎంఈఐ నంబర్‌ తెలియకపోయినా/గుర్తు లేకపోయినా దాన్ని తెలుసుకోవచ్చు. మీ మొబైల్‌ నుంచి *#06# డయల్‌ చేయగానే మీ మొబైల్‌ నంబర్‌పై దాని ఐఎంఈఐ నంబర్‌ ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ ఫోన్‌ పోగొట్టుకుంటే ఫోన్‌ కొన్న బాక్స్‌ మీద లేదా కొనుగోలు చేసిన షాపులో ఉన్న ఇన్‌వాయిస్‌ బిల్లు ద్వారా కూడా ఐఎంఈఐ నంబర్‌ను తీసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us