AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌పరెంట్ స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇదే.. లెనోవో చేసిన అద్భుతం..

Lenovo Transparent Display Laptop: ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలో మొట్టమొదటి ట్రాన్స్‌పరెంట్(పారదర్శక) స్క్రీన్ కలిగిన ల్యాప్ టాప్ ను ఆవిష్కరించింది. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2024 ఈవెంట్‌లో దీనిని ప్రదర్శించింది. ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా నుంచి నేరుగా వచ్చినట్లుగా 17.3-అంగుళాల దృశ్యాన్ని ఆవిష్కరించింది.

ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌పరెంట్ స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇదే.. లెనోవో చేసిన అద్భుతం..
Lenovo Transparent Screen Laptop
Madhu
|

Updated on: Feb 28, 2024 | 8:53 AM

Share

ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలో మొట్టమొదటి ట్రాన్స్‌పరెంట్(పారదర్శక) స్క్రీన్ కలిగిన ల్యాప్ టాప్ ను ఆవిష్కరించింది. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2024 ఈవెంట్‌లో దీనిని ప్రదర్శించింది. ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా నుంచి నేరుగా వచ్చినట్లుగా 17.3-అంగుళాల దృశ్యాన్ని ఆవిష్కరించింది. లెనోవో థింక్‌బుక్ ట్రాన్స్‌పరెంట్ కాన్సెప్ట్‌ పేరిట లాంచ్ అయిన ఈ ల్యాప్ టాప్ లో బోర్డర్ లెస్ స్క్రీన్, పారదర్శక కీబోర్డ్ ప్రాంతం, ఫ్లోటింగ్ ఫుట్‌ప్యాడ్ డిజైన్ దీనిలో ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లెనోవో అనగానే మనకు తక్కువ బడ్జెట్లో బెస్ట్ గ్యాడ్జెట్లు మనకు గుర్తొస్తాయి. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల వంటి వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఓ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చూపించింది లెనోవో. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి పారదర్శక(ట్రాన్స్ పరెంట్) స్క్రీన్ కలిగిన కొత్త ల్యాప్ టాప్ ను తీసుకొచ్చింది. ఈ ల్యాప్ ప్‌టాప్ 17.3-అంగుళాల బోర్డర్‌లెస్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. పిక్సెల్‌లు నలుపుకు సెట్ చేసినప్పుడు 55 శాతం వరకు పారదర్శకత ఉంటుంది. పిక్సెల్‌లు పెంచి బ్రైట్ నెస్ ఎక్కువ చేసినప్పుడు డిస్‌ప్లే తక్కువ పారదర్శకంగా మారుతుంది. ఈ కాన్సెప్ట్ ల్యాప్‌టాప్ 1,000 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్, 720 పిక్సల్స్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఈ లెనోవో థింక్ ప్యాడ్ ట్రాన్స్ పరెంట్ అమోల్డ్ ప్యానల్ లేదు. దానికి బదులుగా మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే ఉంది. మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే ఓఎల్ఈడీ డిస్ ప్లేతో పోలిస్తే మెరుగైన సంతృప్తత, పారదర్శకత, ప్రకాశం, చిత్ర నాణ్యతను అందజేస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగానే..

లెనోవో అనేక ఇతర ప్రీమియం ల్యాప్ టాప్ ల మాదిరిగానే విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగానే పనిచేస్తుంది. అయితే ఇతర హార్డ్‌వేర్-సంబంధిత స్పెసిఫికేషన్‌లను ఆ కంపెనీ వెల్లడించలేదు.

స్కెచ్ లు కూడా గీయొచ్చు..

కాగా లెనోవా కాన్సెప్ట్ వీడియో ఫ్లాట్ టచ్ కీబోర్డ్‌ను కూడా చూపించింది. ఇది అసలు కీబోర్డ్‌గా కాకుండా ప్రొజెక్షన్‌గా ఉంటుంది. మీరు పెన్‌ను థింక్‌బుక్‌కు దగ్గరగా తీసుకువచ్చినప్పుడు కీబోర్డ్ బోర్డుగా మారిపోతోంది. దీని సాయంతో కళాకారులు లేదా వాస్తుశిల్పులు స్కెచ్ చేయడానికి వీలు కల్పిస్తుందని లెనోవో తెలిపింది.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే..

లెనోవో థింక్‌ప్యాడ్ పోర్ట్‌ఫోలియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, టామ్ బట్లర్ మాట్లాడుతూ ఈ సాంకేతికతపై కంపెనీకి చాలా ఎక్కువ విశ్వాసం ఉందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఈ ల్యాప్‌టాప్‌గా అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కపిల్ దేవ్ బౌలింగ్‌కు పాక్ భయపడినట్టే.. డాక్టర్లను చూసి జబ్బు..
కపిల్ దేవ్ బౌలింగ్‌కు పాక్ భయపడినట్టే.. డాక్టర్లను చూసి జబ్బు..
తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో తగ్గనున్నజర్నీ టైమ్
తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో తగ్గనున్నజర్నీ టైమ్
బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్.. ఇప్పుడు తులం ఎంతంటే..?
5 ఏళ్ల తర్వాత రజనీ రుణం తీర్చుకున్న షారుఖ్ .. విషయమేమిటంటే?
5 ఏళ్ల తర్వాత రజనీ రుణం తీర్చుకున్న షారుఖ్ .. విషయమేమిటంటే?
ఫైనల్ తర్వాత ఈ నలుగురికి దిమ్మతిరిగే షాకివ్వనున్న గంభీర్..?
ఫైనల్ తర్వాత ఈ నలుగురికి దిమ్మతిరిగే షాకివ్వనున్న గంభీర్..?
విజయ్, రష్మిక ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి..
విజయ్, రష్మిక ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి..
బాదం vs వేరుశనగలు...ఈజీగా బరువు తగ్గాలంటే రెండింట్లో ఏది బెటర్?
బాదం vs వేరుశనగలు...ఈజీగా బరువు తగ్గాలంటే రెండింట్లో ఏది బెటర్?
విమానం ఆలస్యమైతే బీమా కవరేజీ వస్తుందా..?
విమానం ఆలస్యమైతే బీమా కవరేజీ వస్తుందా..?
మార్చి 21న భారత్ - పాక్ యుద్ధం..! సంచలనంగా మారిన జ్యోతిష్కురాలి..
మార్చి 21న భారత్ - పాక్ యుద్ధం..! సంచలనంగా మారిన జ్యోతిష్కురాలి..
పేరెంట్స్‌కు గుడ్‌న్యూస్..పిల్లలను స్కూల్‌కు పంపేందుకు నో టెన్షన్
పేరెంట్స్‌కు గుడ్‌న్యూస్..పిల్లలను స్కూల్‌కు పంపేందుకు నో టెన్షన్