Laptop Charging: మీ ల్యాప్‌టాప్‌లో చార్జింగ్ త్వరగా అయిపోతుందా..? ఈ టిప్స్ పాటించండి!
ప్రస్తుతం ల్యాప్‌టాప్ వినియోగం చాలా పెరిగిపోయింది. కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోం కారణంగా వీటి వినియోగం ఎక్కువైపోయింది. అంతేకాకుండా కరోనా సమయంలో విద్యార్థులకు సైతం ఆన్‌లైన్ క్లాసులను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు కూడా ల్యాప్‌టాప్‌లను..
ప్రస్తుతం ల్యాప్‌టాప్ వినియోగం చాలా పెరిగిపోయింది. కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోం కారణంగా వీటి వినియోగం ఎక్కువైపోయింది. అంతేకాకుండా కరోనా సమయంలో విద్యార్థులకు సైతం ఆన్‌లైన్ క్లాసులను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు కూడా ల్యాప్‌టాప్‌లను వినియోగించారు. చాలా మంది కూడా సినిమాలు, గేమ్స్, ఇతర వీడియో ల్యాప్‌టాప్‌లోనే చూసేస్తున్నారు. ఇలాంటి సమయంలో చాలా మందికి వచ్చే సమస్య ఏంటంటే ల్యాప్‌లాప్‌లో చార్జింగ్ త్వరగా అయిపోవడం. ల్యాప్‌టాప్ వాడుతున్నంత సేపు చార్జింగ్ పెట్టే వాడుతున్నారు. తర్వాత చార్జింగ్ ఫుల్ అయిపోయిన తర్వాత కొంత సేపటికే చార్జింగ్ అయిపోతుంటుంది. కొన్ని ల్యాప్‌టాప్‌లలో గంట చార్జింగ్ కూడా రాని పరిస్థితి ఉంటుంది. కొత్త ల్యాప్‌టాప్ అయితే మహా అయితే 3 గంటలు, లేదా 4 గంటల చార్జింగ్ వస్తుంటుంది. కానీ రానురాను ఆ చార్జింగ్ సమయం కూడా తగ్గిపోతుంటుంది. ల్యాప్‌టాప్‌లలో ఎక్కువ సేపు చార్జింగ్ రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. కొన్ని టిప్స్ వాడితే ఎక్కువ సేపు చార్జింగ్ వచ్చేలా చేసుకోవచ్చు. మరి మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ మెరుగవ్వాలంటే ఈ టిప్స్ పాటించండి.
- పవర్ సెట్టింగ్స్‌ను మార్చండి: చార్జింగ్ ఎక్కువ సమయం రావాలంటే విండోస్ 10లో పవర్ సేవింగ్ సెట్టింగ్స్‌ను మార్చాలి. స్టార్ట్ సెర్చ్ బార్‌లో పవర్ సేవర్ అని టైప్ చేస్తే పవర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. మానిటర్ పవరింగ్ ఆఫ్, స్లీప్ మోడ్‌కు త్వరగా వెళ్లడం లాంటి ఆప్షన్లు ఉంటాయి. అదేవిధంగా టాస్క్‌బార్ లోని బ్యాటరీని ఐకాన్ పై క్లిక్ చేసి పవర్ అని టైప్ చేయడంతో ఆప్షన్స్ కనిపిస్తాయి. మానిటర్ పవరింగ్ ఆఫ్, స్లీప్ మోడ్‌కు త్వరగా వెళ్లడం లాంటి ఆప్షన్లుంటాయి. అదేవిధంగా టాస్క్‌బార్‌లోని బ్యాటరీ ఐకాన్ పై క్లిక్ చేసి కూడా పవర్ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. దీని వల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. ఎక్కువ సమయం చార్జింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
- డిమ్ స్క్రీన్: ల్యాప్‌టాప్ చార్జింగ్ ఎక్కువ సేపు రావాలంటే డిప్ స్క్రీన్ వాడాలి. ఫుల్ బ్రూట్‌నెస్ పెడితే త్వరగా చార్జింగ్ అయిపోయే అవకాశం ఉంది. అందుకే బ్యాటరీ ఎక్కువ సేపు రావాలంటే ట్యాబ్‌లలో స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించుకోవాలి.
- కనెక్టివిటీ ఆప్షన్లు ఆఫ్ చేయండి: వైర్‌లెస్ నెట్‌వర్క్ వంటి ఫీచర్స్ మీ ల్యాప్‌టాప్ బ్యాటరీని ఎక్కువగా వినియోగించుకుంటాయి. అందుకే అవసరం లేని వైఫై ఆఫ్‌లో ఉంచాలి. అలాగే బ్లూటూత్‌ను సైతం ఆఫ్ చేయాలి.
- అన్‌ప్లగ్ చేయండి: చాలా మంది ల్యాప్‌టాప్‌లకు మౌస్, ఎక్స్‌టర్నల్ కీ బోర్డులు వాడుతుంటారు. ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్‌లు, వెబ్‌క్యామ్ వినియోగిస్తుంటారు. అవసరమైపోయాక వాటిని తీసేయాలి. ముఖ్యంగా ఎక్స్‌టర్నల్ హార్డ్‌డ్రైవ్‌లు యూఎస్‌బీలు లాంటివి డేటా ట్రాన్స్‌ఫర్ అయిన వెంటనే తీసేయాలి. లేకపోతే అవి కూడా పవర్‌ను వినియోగించుకుంటాయి. దీని వల్ల చార్జింగ్ త్వరగా అయిపోతుంటుంది.
- చార్జింగ్: ఇక ల్యాప్‌టాప్ పూర్తిగా బ్యాటరీ అయిపోయే ముందు చార్జింగ్ పెట్టాలి. వీలైనంత వరకు చార్జింగ్ 20 శాతానికి తగ్గకముందే చార్జి పెడితే మంచిది. అదే విధంగా 100 శాతం చార్జింగ్ అయిన తర్వాత చాలా మంది చార్జింగ్ అలాగే ఉంచేస్తారు. ఇలా చేయడం సరైంది కాదు. బ్యాటరీ ఎక్కువ కాలం రావాలంటే ఫుల్ చార్జింగ్ అయిపోగానే చార్జింగ్ ఆపేయాలి. ఫుల్ చార్జ్ అయిన తర్వాత కూడా చార్జింగ్‌ను అలాగే ఉంచి వాడటం సరైంది కాదంటున్నారు టెక్ నిపుణులు. మీ ల్యాప్‌టాప్‌లో కొన్ని ఫీచర్స్ పదేపదే అప్‌డేట్ అవుతుంటాయి. అలా అప్‌డేట్ ఆప్షన్ ఉండటం వల్ల బ్యాటరీ తగ్గిపోయే అవకాశం ఉంది. వీలైనంత వరకు అటోమేటిక్ అప్‌డేట్ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవడం మంచిది. దీని వల్ల పవర్ సేవ్ అవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి