Jio: మరో అద్భుతానికి శ్రీకారం చుడుతోన్న జియో.. ఆకాష్ అంబానీ కీలక ప్రకటన..
ఇందులో భాగంగా జియో, ఐఐటీ ముంబయితో కలిసి పనిచేయనుందని ఆకాష్ తెలిపారు. అలాగే టీవీలకు ఆపరేటింగ్ సిస్టమ్‌ను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఇన్‌స్టిట్యూట్స్ యాన్యువల్ టెక్ ఫెస్ట్‌లో మాట్లాడిన ఆకాష్ అంబానీ.. కంపెనీకి ఎకో సిస్టమ్ డెవలప్‌మెంట్ ఎంతో ముఖ్యమన్నారు. జియో 2.0 విజన్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఐఐటీ బాంబే సహాయంతో కలిసి..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. బడా టెక్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలు దిగ్గజ సంస్థలన్నీ చాట్ జీపీటీ సేవలను అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ రంగంలోకి దేశీయ టెలికం సంస్థ జియో కూడా అడుగుపెడుతోంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ‘భారత్ జీపీటీ’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగా జియో, ఐఐటీ ముంబయితో కలిసి పనిచేయనుందని ఆకాష్ తెలిపారు. అలాగే టీవీలకు ఆపరేటింగ్ సిస్టమ్‌ను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఇన్‌స్టిట్యూట్స్ యాన్యువల్ టెక్ ఫెస్ట్‌లో మాట్లాడిన ఆకాష్ అంబానీ.. కంపెనీకి ఎకో సిస్టమ్ డెవలప్‌మెంట్ ఎంతో ముఖ్యమన్నారు. జియో 2.0 విజన్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఐఐటీ బాంబే సహాయంతో కలిసి భారత్ జీపీటీ ప్రోగ్రామ్‌ను చేపట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక తమ ఆర్గనైజేషన్‌లో ఏఐ టెక్నాలజీని లాంచ్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇక వచ్చే దశాబ్ధం నాటికి భారత్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారతుందన్న ఆకాష్ అంబానీ.. భారత్ 6 ట్రిలియన్ డాలర్ల ఎకానామికీ చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జియోను ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌గా అభివర్ణించిన ఆకాష్ అంబానీ.. యువ పారిశ్రామికవేత్తలు తాము విఫలమవుతామన్న భయం ఉండకూదన్నారు. వ్యాపారవేత్తలు సామాజిక న్యాయం కోసం పనిచేయాలని అంబానీ కోరారు.
ఇదిలా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయమై గతంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రిలయన్స్ 46వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ విషయమై ఆయన ఓ ప్రటకన చేశారు. జియో ఏఐ టెక్నాలజీని అందజేస్తుందని ఆయన స్పష్టం చేశారు. చాట్ జీపీటీ రూపకల్పనలో కీలక వ్యక్తి అయిన సామ్ ఆల్ట్ మాన్.. భారతీయులు చాట్ జీపీటీ ఏఐ వ్యవస్థను సృష్టించడం కష్టమని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో… ఏఐలో రాణించటానికి అవసరమైన వనరులు, నిబద్ధత భారత్ సొంతమని ముఖేష్ అంబానీ ధీటుగా సమాధానం ఇచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..