Jio Prepaid Plan: జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 జీబీ డేటా.. ది బెస్ట్ ప్లాన్ ఇదే
ప్రస్తుతం డేటా ఎక్కువగా వాడే వారి కోసం జియో అందిస్తున్న ప్లాన్ ఎక్కువగా ప్రజాదరణ పొందుతుంది. రోజుకు 2.5 జీబీ డేటాతో అందించే ఈ ప్లాన్ ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోం చేసుకునే ఉద్యోగులకు ఉపయోగపడుతుంది.
భారతదేశంలో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా విస్తృత శ్రేణి వినియోగదారులను కలిగి ఉంది. కాబట్టి తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు సరికొత్త ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. అయితే జీయోకు ఎక్కువ శాతం ప్రీపెయిడ్ కస్టమర్లు ఉన్నందున ప్రీపెయిడ్ రీఛార్జ్ విభాగంలో విభాగంలో మరిన్ని ఎంపికలను అందిస్తుంది. కస్టమర్ సౌలభ్యం కోసం జియో తన ప్లాన్‌లను వివిధ రకాల కేటగిరీలు, టాప్ ట్రెండింగ్ ప్లాన్‌లు, ట్రెండింగ్ ప్లాన్‌లు, పాపులర్ ప్లాన్‌లు, బెస్ట్ సెల్లింగ్ ప్లాన్‌లు, డేటా లిమిట్‌కు ప్లాన్‌లు, టాప్ వాలిడిటీకి ప్లాన్‌లు వంటి సబ్-కేటగిరీలలో సరికొత్త ప్లాన్స్‌ను వినియోగదారులకు అందిస్తుంది. ప్రస్తుతం డేటా ఎక్కువగా వాడే వారి కోసం జియో అందిస్తున్న ప్లాన్ ఎక్కువగా ప్రజాదరణ పొందుతుంది. రోజుకు 2.5 జీబీ డేటాతో అందించే ఈ ప్లాన్ ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోం చేసుకునే ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. అలాగే అధిక డేటా వినియోగించే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ధర రూ.899గా ఉంది. ఈ ప్లాన్ ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
జియో రూ. 899 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అలాగే అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను (లోకల్, ఎస్టీడీతో సహా), అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌తో అన్ని జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందిస్తుంది. జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 2.5 జీబీ హై-స్పీడ్ డేటాను 90 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. అంటే ప్లాన్ మొత్తం 225 జీబీ డేటాను కలిగి ఉంది. అయితే, రోజువారీ డేటా పరిమితిని చేరుకున్న తర్వాత వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అంతేకాదు అర్హత ఉన్న జియో సబ్‌స్క్రైబర్‌లు 5జీ అనుబంధ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే 5 జీ సేవలను ఆస్వాదించడానికి జియో వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..