Jio AirFiber: ఆ ఎనిమిది నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్ సేవలు.. తక్కువ ధరకే సూపర్ స్పీడ్ వైర్‌లెస్ ఇంటర్నెట్..
పెరిగిన యూజర్ల నేపథ్యంలో మొబైల్ నెట్‌వర్క్ స్లో అవుతుంది. అలాగే కేబుల్ ఫైబర్ నెట్‌వర్క్‌లు ప్రతిచోటా అందుబాటులో ఉండవు. అందువల్ల ప్రజలు వైర్‌లెస్ కనెక్షన్‌తో వేగవంతమైన వేగాన్ని సాధించడంలో సహాయపడటానికి జియో సెప్టెంబర్ 2023లో జియో ఎయిర్ ఫైబర్‌ను లాంచ్ చేసింది. జియో ఎయిర్ ఫైబర్ అనేది జియో అందించే వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవ. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి 5జీ సాంకేతికతను ఉపయోగిస్తుంది.

భారతదేశంలో డేటా వినియోగం కొత్త దశకు చేరుకుంది. ముఖ్యంగా టెలికాం మార్కెట్‌లో జియో ఎంట్రీతో భారతదేశంలో సీన్ మారిపోయింది. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగి తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవను ఆశ్వాదించగలుగుతున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా యూపీఐ నంచి అన్ని సౌకర్యాలను డిజిటలైజేషన్ చేసింది. దీంతో ప్రజలకు ఫాస్ట్-స్పీడ్ ఇంటర్నెట్ అవసరంగా మారింది. అయితే పెరిగిన యూజర్ల నేపథ్యంలో మొబైల్ నెట్‌వర్క్ స్లో అవుతుంది. అలాగే కేబుల్ ఫైబర్ నెట్‌వర్క్‌లు ప్రతిచోటా అందుబాటులో ఉండవు. అందువల్ల ప్రజలు వైర్‌లెస్ కనెక్షన్‌తో వేగవంతమైన వేగాన్ని సాధించడంలో సహాయపడటానికి జియో సెప్టెంబర్ 2023లో జియో ఎయిర్ ఫైబర్‌ను లాంచ్ చేసింది. జియో ఎయిర్ ఫైబర్ అనేది జియో అందించే వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవ. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి 5జీ సాంకేతికతను ఉపయోగిస్తుంది. వినియోగదారులు గరిష్టంగా 1 జీబీపీఎస్ వేగాన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు. జియో ఎయిర్‌ఫైబర్ వైర్‌లెస్ 4జీ డాంగిల్‌ల మాదిరిగానే ఉంటుంది. అయితే 5 జీ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ వంటి వేగం వంటి అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.
ఎనిమిది నగరాల్లోనే సేవలు
జియో దేశవ్యాప్తంగా ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే ప్రారంభం నాటికి ఈ సేవ కేవలం ఎనిమిది నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే నగారల్లోనే జియో ఎయిర్‌ఫైబర్ సేవలను పొందే అవకాశం ఉంది.
ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ బుకింగ్ ఇలా
- మీ ప్రాంతంలో జియో ఎయిర్‌ఫైబర్ అందుబాటులో ఉందో? లేదో? తనిఖీ చేయడానికి జియో వెబ్‌సైట్, మైజియో యాప్ లేదా జియో కస్టమర్ సపోర్ట్‌ని సంప్రదించాలి.
- బుకింగ్ ప్రారంభించడానిక మీరు 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. లేకపోతే జియో వెబ్‌సైట్ లేదా మై జియో యాప్‌ని సందర్శించడం లేదా మీ సమీపంలోని జియో స్టోర్‌ని సందర్శించడం ద్వారా కొత్త కనెక్షన్‌ని బుక్ చేసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన వివరాలను అందించి జియో ఎయిర్‌ఫైబర్ కోసం నమోదు చేసుకోవాలి.
- మీ భవనం లేదా ప్రదేశంలో సేవలు అందుబాటులోకి వచ్చినప్పుడు జియో మిమ్మల్ని సంప్రదిస్తుంది.
- మీ బుకింగ్ ధ్రువీకరించబడిన తర్వాత మీరు వైఫై రూటర్, 4కే స్మార్ట్ సెట్-టాప్ బాక్స్, వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్‌తో కూడిన మీ జియో కనెక్షన్‌ని అందుకుంటారు. మీ టెర్రేస్/రూఫ్‌టాప్ లేదా మీ ఇంటి వెలుపల కూడా అవుట్‌డోర్ యూనిట్ ఇన్‌స్టాల్ చేస్తారు.
జియో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా కొత్త కనెక్షన్‌ని అందిస్తుంది. అయితే కంపెనీ రూ. 1,000 ఇన్‌స్టాలేషన్ సేవను ఛార్జ్ చేస్తుంది. మీరు వార్షిక ప్లాన్‌ని ఎంచుకుంటే ఈ రుసుము ఉండదు. వినియోగదారులు వార్షిక ప్లాన్ ప్రయోజనాలను పొందుతూనే క్రెడిట్/డెబిట్ కార్డ్ ఆధారిత ఈఎంఐను ఉపయోగించి నెలవారీగా చెల్లించే అవకాశం కూడా ఉంది.
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లు
జియో ఎయిర్ ఫైబర్ కింద యూజర్లు వరుసగా రూ. 599, రూ. 899, రూ. 1199 ధరల పాయింట్లతో మూడు ప్లాన్‌లను అందజేస్తుంది. ఈ ప్లాన్‌లు 550కి పైగా డిజిటల్ ఛానెల్‌లు, 14 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలతో పాటు 100 ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తాయి. రూ.1199 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియమ్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లు కూడా ఉన్నాయి.
జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ ప్లాన్‌లు
ఈ ప్లాన్స్‌లో భాగంగా జియో వరుసగా రూ. 1499, రూ. 2499, రూ. 3999 ధరలతో మూడు ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు గరిష్టంగా 1జీబీపీఎస్ ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తాయి. 550కి పైగా డిజిటల్ ఛానెల్‌లు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో ప్రీమియం వంటి 14 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌తో సహా అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ అందుబాటులో ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







