Internet Speed: ఒక్క సెకనులో 57000 సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునే ఇంటర్నెట్ వేగాన్ని సాధించి రికార్డ్ సృష్టించిన జపాన్!

Internet Speed:  ఇంటర్నెట్ ప్రపంచాన్ని మార్చేసింది. ఆ వేగంతో ప్రజలు ప్రస్తుతం పరుగులు తీస్తున్నారు. జన జీవితం ఎంతో సులభతరం అయిపోయింది ఈ ఆవిష్కరణతో.

Internet Speed: ఒక్క సెకనులో 57000 సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునే ఇంటర్నెట్ వేగాన్ని సాధించి రికార్డ్ సృష్టించిన జపాన్!
Internet Speed

Internet Speed:  ఇంటర్నెట్ ప్రపంచాన్ని మార్చేసింది. ఆ వేగంతో ప్రజలు ప్రస్తుతం పరుగులు తీస్తున్నారు. జన జీవితం ఎంతో సులభతరం అయిపోయింది ఈ ఆవిష్కరణతో. ఇంటర్నెట్ ముందు.. తరువాత అని చెప్పుకునేలా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఇంటర్నెట్ మరింత వేగవంతం అయిపోతోంది. ఇప్పటికే . చైనా, అమెరికా వంటి దేశాల్లో 6 జి పరీక్ష ప్రారంభమైంది. అయితే, దీనిని మించిపోయే ఇంటర్నెట్ వేగాన్ని జపాన్ సాధించింది.  జపాన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఎన్ఐఐసిటి) ప్రయోగశాలలో చేసిన పరీక్షల సమయంలో ఇంటర్నెట్ వేగం సెకనుకు 319 టెరాబైట్లకు (టిబి) వచ్చింది. ఈ వేగం ఇప్పటివరకు అన్ని రికార్డులను బద్దలుకొట్టింది.

గత సంవత్సరం ఇదే పరీక్షలో, ఈ వేగం సెకనుకు 178 టెరాబైట్ (టిబి) కి వచ్చింది. 1 టిబి వేగం అంటే  1024 జీబీ అని అర్ధం.  సరిగ్గా చెప్పాలంటే ఈ వేగంతో  మీరు సెకనులో 57,000 సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా కూడా సెకనుకు 440 గిగాబైట్ల ఇంటర్నెట్ వేగాన్ని ఉపయోగిస్తుంది.

ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌లోనే కొన్ని మార్పులు చేయడం ద్వారా జపాన్ ఈ విజయం సాధించింది. జపాన్ ల్యాబ్‌లో సాధించిన ఇంటర్నెట్ వేగం చిటికెలో అతిపెద్ద ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వేగం ప్రపంచంలోనే అత్యధికం. ఈ వేగంతో 57,000 సినిమాలను సెకనులో డౌన్‌లోడ్ చేసుకోగలిగే విధంగా మీరు దాని వేగాన్ని అంచనా వేయవచ్చు. పరిశోధన ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌లోనే కొన్ని ముఖ్యమైన విషయాలను మార్చడం ద్వారా ఈ వేగాన్ని వారు చేరుకున్నారు.  ఇది ఖర్చును కూడా తగ్గిస్తుంది. ఈ వేగాన్ని పొందడానికి జపాన్ ల్యాబ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను ఉపయోగించింది.

3001 కిలోమీటర్ల పొడవైన ప్రసారాన్ని సిద్ధం చేసింది
జపాన్ ల్యాబ్‌లో చేసిన ఈ పరీక్ష నివేదికను గత నెలలో అంతర్జాతీయ సమావేశంలో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్స్‌లో సమర్పించారు. ఇందుకోసం 3001 కిలోమీటర్ల పొడవున ప్రసారం చేయడానికి ఎన్‌ఐఐసిటి సిద్ధం చేసిందని వెల్లడించారు.  ఏదేమైనా, ఈ నివేదికలో ఇది నిజం కావడానికి ఇంకా చాలా చేయవలసి ఉంది. ఈ వేగాన్ని సాధించడానికి, పరిశోధకులు వివిధ తరంగదైర్ఘ్యాల కోసం ప్రత్యేక లోహంతో తయారు చేసిన యాంప్లిఫైయర్,  552 ఛానల్ కూంబ్  లేజర్‌ను ఉపయోగించారు. మరింత ఎక్కువ ఇంటర్నెట్ వేగం సాధించవచ్చని ఈ పరిశోధనలు చేసిన బృందం భావిస్తోంది.

Also Read: Space Tourism: సరదాగా అంతరిక్షంలోకి వెళ్లి కప్పు టీ తాగి వస్తారా? ఇంకా మజా కావాలంటే ఎంచక్కా పెళ్లి కూడా చేసుకుని రావచ్చు.. ఎలానో తెలుసా?

3D Printed Bridge: రోబోట్స్ తయారు చేసిన 3డీ వంతెన.. ప్రపంచంలో ఇదే మొదటిది.. ఎక్కడ నిర్మించారంటే..

 

 

 

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu