Itel P55 5G: ఐటెల్ నుంచి మార్కెట్‌లోకి త్వరలో కొత్త ఫోన్ లాంచ్.. తక్కువ ధరలో వచ్చే బెటర్ 5జీ ఫోన్ ఇదే..!
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో 5జీ సర్వీసులను టెలికాం కంపెనీలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు తక్కవ ధరలో 5 జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే ఫోన్ల గురించి వెతుకుతున్నారు. కంపెనీలు కూడా తక్కువ ధరలో 5 జీ ఫోన్స్‌ను లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ 5 జీ ఫోన్ల ధర 10 నుంచి 15 వేల రూపాయల వరకూ ఉంటున్నాయి. దీంతో సగటు మధ్య ప్రజలు ఈ ఫోన్ల కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు.
భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ వాడకాన్ని ఇష్టపడుతున్నారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసుల కల్చర్ పెరగడంతో ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. స్మార్ట్ ఫోన్ వినియోగంలో అమెరికా చైనా తర్వత స్థానంలో భారత్ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి అన్ని కంపెనీలు తమతమ కొత్త మోడల్స్ ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో 5జీ సర్వీసులను టెలికాం కంపెనీలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు తక్కవ ధరలో 5 జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే ఫోన్ల గురించి వెతుకుతున్నారు. కంపెనీలు కూడా తక్కువ ధరలో 5 జీ ఫోన్స్‌ను లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ 5 జీ ఫోన్ల ధర 10 నుంచి 15 వేల రూపాయల వరకూ ఉంటున్నాయి. దీంతో సగటు మధ్య ప్రజలు ఈ ఫోన్ల కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిని ఆకర్షించడానికి ఐటెల్ కంపెనీ మరో కొత్త ఫోన్ లాంచ్ చేస్తుంది. ఐటెల్ రిలీజ్ చేసే ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఐటెల్ మొబైల్ ఇండియా త్వరలో మార్కెట్లోకి కంపెనీకు సంబంధించి మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ అయిన ఐటెల పీ 55 5జీని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీని ధర దేశంలో రూ. 10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ధర పరిధిలో ఉన్న ఏకైక 5జీ ఫోన్ అని కంపెనీ చెబుతోంది. ఇది భారత బడ్జెట్‌కు అనుకూలమైన సమర్థవంతమైన, శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ అని ఐటెల్ చెప్పింది. 5జీ స్మార్ట్‌ఫోన్‌తో రూ.10,000 స్మార్ట్‌ఫోన్ డొమైన్‌లో కంపెనీ ఆధిపత్యం కోసం చూస్తోంది. ఐటెల్ జోడించిన దాని కొత్త బ్రాండ్ విజన్ టెక్నాలజీ శక్తి ద్వారా ప్రతి భారతీయుడి జీవితంపై సానుకూల ప్రభావం చూపాలనే దాని నిబద్ధత గురించి గొప్పగా చెబుతుంది. ఐటెల్ కంపెనీ ఇప్పటికే 4 జీ స్మార్ట్‌ఫోన్‌లను రూ. 8,000 సెగ్మెంట్‌లో అందిస్తుంది. మొదటిసారి కొనుగోలు చేసేవారిలో అత్యధిక రిపీట్ యూజర్లు ఉన్నారు. ఐటెల్ పీ 55 లాంచ్ తేదీ స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..