Smartphone Speed: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మారిస్తే వేగవంతం అవుతుంది
Smartphone Speed: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. రకరకాల స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అందులో ఇష్టానుసారంగా ఫోటోలు లోడ్ చేయడం, అధికంగా యాప్స్ (Apps)వాడుతుండటం..
Smartphone Speed: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. రకరకాల స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అందులో ఇష్టానుసారంగా ఫోటోలు లోడ్ చేయడం, అధికంగా యాప్స్ (Apps)వాడుతుండటం వల్ల అప్పుడప్పుడు ఫోన్ నెమ్మదిస్తుంటుంది. దీని వల్ల కొంత చికాకు వస్తుంటుంది. ఫోన్ యూజర్లలో చాలామంది తమ ఫోన్ స్లోగా ఉందని, హ్యాంగ్ అవుతోందని చెబుతుంటారు. ఫోన్‌లలో అడ్డగోలుగా ఫోటోలు, వీడియోలు లోడ్ చేస్తుండటం వల్ల కూడా వేగం తగ్గిపోతుంది. అయితే ఫోన్ వేగవంతం కావాలంటే కొన్ని చిట్కాలు (Tips) పాటిస్తే సరిపోతుందని అంటున్నారు టెక్ నిపుణులు. స్మార్ట్‌ఫోన్‌ను వేగంగా స్మూత్‌గా మార్చడం మీ చేతిలోనే ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్ మారిస్తే మీ ఫోన్ వేగంగా పనిచేస్తుంది. అయితే చాలామందికి ఆ సెట్టింగ్స్ గురించి తెలియక తమ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదని ఇబ్బందులు పడుతుంటారు.
స్మార్ట్‌ఫోన్ కోసం మూడు టిప్స్:
ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లో మూడు టిప్స్ పాటిస్తే ఫోన్ వేగం అవుతుందంటున్నారు టెక్ నిపుణులు. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో About ఓపెన్ చేసి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిందో లేదో చూడండి. లేకపోతే మీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయండి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడానికి 15 నిమిషాలు పట్టవచ్చు. ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి manage apps and device పైన క్లిక్ చేయండి. అందులో యాప్స్ ఏవైనా అప్‌డేట్ చేయాల్సి ఉందేమో చూడండి. అన్ని యాప్స్ అప్‌డేట్ చేయండి.
డెవలపర్ మోడ్ ఎనేబుల్ చేయండి..
మీ స్మార్ట్‌ఫోన్‌లో యానిమేషన్స్ ఉంటే స్లోగా ఆపరేట్ అవుతుంది. పాత స్మార్ట్‌ఫోన్స్‌లో యానిమేషన్స్ సరిగ్గా పనిచేయవు. అందుకే సెట్టింగ్స్ ఓపెన్ చేసి About పైన క్లిక్ చేయండి. Build number పైన ఏడు సార్లు ట్యాప్ చేయండి. డెవలపర్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత సెట్టింగ్స్‌లో, సిస్టమ్స్‌లో డెవలపర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. కిందకు స్క్రోల్ చేస్తే యానిమేషన్స్ కనిపిస్తాయి. యానిమేషన్స్ మొత్తం ఆఫ్ చేయండి. ఇక మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ పైన క్లిక్ చేయండి. Manage Storage పైన క్లిక్ చేయండి. అవసరం లేని ఫైల్స్, యాప్స్ డిలిట్ చేయండి. ముఖ్యమైన ఫైల్స్ ఎక్కువగా ఉంటే మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లోకి బ్యాకప్ చేసుకోండి. లేదా మెమొరీ కార్డులో ట్రాన్స్‌ఫర్ చేయండి. చిన్నపాటి టిప్స్‌తో స్మార్ట్‌ఫోన్‌ను వేగవంతం అయ్యేలా చేసుకోవచ్చు. ఈ టిప్స్‌తో కూడా మీ స్మార్ట్‌ఫోన్ ఎలాంటి మార్పులు రాకపోతే ఫైల్స్ అన్నీ బ్యాకప్ చేసి స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత అవసరమైన యాప్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలి.
ఇవి కూడా చదవండి: