5G In India: 5జీ నెట్‌వ‌ర్క్ ఆరోగ్యంపై దుష్ప్ర‌భావం చూపిస్తుందా..? ఇందులో నిజ‌మేంత‌.. తేల్చి చెప్పిన సీవోఏఐ..

5G In India: భార‌త్‌లో 5జీ నెట్‌వ‌ర్క్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ క్ర‌మంలోనే దీని చుట్టూ గ‌త‌కొన్ని రోజుల‌గా వివాదం చెల‌రేగుతూనే ఉంది. భార‌త్‌లో 5జీ టెక్నాల‌జీ...

5G In India: 5జీ నెట్‌వ‌ర్క్ ఆరోగ్యంపై దుష్ప్ర‌భావం చూపిస్తుందా..? ఇందులో నిజ‌మేంత‌.. తేల్చి చెప్పిన సీవోఏఐ..
5g Network
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 07, 2021 | 9:07 AM

5G In India: భార‌త్‌లో 5జీ నెట్‌వ‌ర్క్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ క్ర‌మంలోనే దీని చుట్టూ గ‌త‌కొన్ని రోజుల‌గా వివాదం చెల‌రేగుతూనే ఉంది. భార‌త్‌లో 5జీ టెక్నాల‌జీ ట్ర‌య‌ల్ ర‌న్ చేయ‌డం వ‌ల్లే క‌రోనా సెకండ్ ఈ రేంజ్‌లో వ్యాపించింద‌ని గ‌తంలో కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీటిలో ఏ మాత్రం నిజం లేద‌ని నిపుణులు స‌ద‌రు ఫేక్ వార్త‌ల‌ను ఖండించారు. ఇదిలా ఉంటే తాజాగా 5జీ టెక్నాల‌జీ ఆరోగ్యంపై దుష్ప్ర‌భావం చూపుతుంద‌ని వార్త‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది సెల్యులార్‌ ఆపరేటర్ల అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ). ఇది ముమ్మాటికీ త‌ప్పుడు ప్రచార‌మ‌ని తేల్చి చెప్పింది. 5జీ టెక్నాల‌జీ చాలా సుర‌క్షిత‌మైంద‌ని.. అన్ని ఆధారారాలు దీన్ని బ‌ల‌ప‌రుస్తున్నాయ‌ని తెలిపింది. 5జీ టెక్నాల‌జీ రాక‌తో ఆర్థిక రంగంతో పాటు స‌మాజానికి అనే ప్ర‌యోజ‌నాలు జ‌రుగుతాయ‌ని సీవోఏఐ అభిప్రాయ‌ప‌డింది. అంతేకాకుండా.. భారత్‌లో టెలికాం రంగంలో విధించిన ఎలక్ట్రోమాగ్నటిక్‌ రేడియేషన్‌ పరిమితి.. అంతర్జాతీయంగా ఆమోదించిన పరిమాణంలో పదో వంతు మాత్రమేనని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. దేశంలో 5జీ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. పిటిషన్‌ లోపభూయిష్టంగా ఉందంటూ ఆమెతో పాటు ఇద్దరు సహ పిటిషనర్లకు రూ.20 లక్షల జరిమానా విధించింది. హైకోర్టు తీర్పును ఎస్పీ కొచ్చర్‌ స్వాగతిస్తూ… ఇది వదంతులకు అడ్డుకట్ట వేస్తుందన్నారు.

Also Read: Sonali Bendre : క్యాన్సర్ రోజులను గుర్తు చేసుకున్న అలనాటి ముద్దుగుమ్మ..! నొప్పితో బాధపడుతున్న ఫొటో రిలీజ్..

Akhanda Movie: బాలయ్య సినిమా పై మరో బజ్.. ‘అఖండ’ రిలీజ్ అయ్యేది ఆరోజే..?

Anandaiah Medicine: ఎన్నో వివాదాలు.. ఎన్నో అనుమానాలు.. నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ