Twitter: తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు సిద్ధమైన ట్విట్టర్.. ‘బర్డ్ వాచ్’ పేరుతో కొత్త టూల్..
Twitter Bird Watch: సమాచార మార్పిడిలో సోషల్ మీడియా పెను సంచలనంగా దూసుకొచ్చింది. అయితే ఇదే సమయంలో ఫేక్ వార్తలు సైతం అదే స్థాయిలో వ్యాపిస్తున్నాయి. ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన...
Twitter Bird Watch: సమాచార మార్పిడిలో సోషల్ మీడియా పెను సంచలనంగా దూసుకొచ్చింది. అయితే ఇదే సమయంలో ఫేక్ వార్తలు సైతం అదే స్థాయిలో వ్యాపిస్తున్నాయి. ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తప్పుడు వార్తలు అదే స్థాయిలో సర్క్యూలేట్ అవుతున్నాయి. అయితే ఈ ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేయడానికి ఇప్పుటికే పలు సోషల్ మీడియా దిగ్గజాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ట్విట్టర్ తాజాగా మరో ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే ‘బర్డ్ వాచ్’ అనే మరో కొత్త టూల్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారుల్లో కొంతమందికి పైలట్ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా యూజర్లు తమకు అనుమానున్న ట్వీట్లను మార్క్ చేసి.. అందుకు గల కారణాలను వివరించాలి. అనంతరం సదరు ట్వీట్ ఎందుకు తప్పు అనే విషయాన్ని తెలుసుకోనేందుకు చిన్నపాటి సర్వే జరుగుతుంది. అయితే ఒకవేళ ట్వీట్ ఫేక్ అని తెలిస్తే తొలగిస్తుందా.? లేదా ఏదైనా మార్క్ చేస్తుందా అన్న దానిపై ట్విట్టర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ట్వీట్లు నిజమైనవా.? కాదా.. అన్న దానిపై ట్విట్టర్ ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read: Pakistan Train Accident: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 30 మంది దుర్మరణం..