Iqoo Quest Day: ఐక్యూ క్వెస్ట్ సేల్ షురూ.. ఆ ఫోన్లపై భారీ తగ్గింపులు.. అదిరే బ్యాంకు ఆఫర్లు కూడా..!
తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ సరికొత్త సేల్ డేస్‌తో మన ముందుకు వచ్చింది. ఐక్యూ క్వెస్ట్ సేల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఐక్యూ అన్ని ఫోన్లపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తుంది.

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం గణనీయంగా పెరిగింది. అమెరికా, చైనా తర్వాత భారత్‌లోనే అధికంగా స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతున్నాయి. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు భారతదేశంలో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నారు. అయితే ప్రీమియం ఫోన్ల విషయానికి వస్తే భారతదేశం కాస్త వెనుకబడింది. ఇక్కడ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండడంతో అందరూ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లనే వాడుతున్నారు. దీంతో బడ్జెట్ ఫోన్ల తయారీ కూడా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలను పెంచుకునేందుకు కొన్ని కంపెనీలు ప్రత్యేక సేల్ డేస్ ద్వారా స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ సరికొత్త సేల్ డేస్‌తో మన ముందుకు వచ్చింది. ఐక్యూ క్వెస్ట్ సేల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఐక్యూ అన్ని ఫోన్లపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తుంది. జూలై 24 నుంచి 28 వరకూ సాగుతున్న ఈ సేల్‌లో ఏయే ఫోన్లపై తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
ఐక్యూ 11 5జీ
ఈ ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ తగ్గింపు ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పని చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.56,990 ఉండగా ఈ సేల్‌లో రూ.49999కే అందుబాటులో ఉంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనపు తగ్గింపు లభిస్తుంది.
ఐక్యూ 9
స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌లో రెండు వేరింయట్లు ఉన్నాయి. ఐక్యూ 9 ప్రో ఫోన్ ఈ సేల్ రూ.39,999కే అందుబాటులో ఉంది. అలాగే ఐక్యూ 9 టీ ఫోన్ కూడా రూ.42,990కు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల కార్డులపై తక్షణ తగ్గింపును పొందవచ్చు.
ఐక్యూ 9 ఎస్‌ఈ
స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్ ఎమోఎల్‌ఈడీ డిస్ ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.28,990గా ఉంది. అలాగే ఈఎంఐ లావాదేవీలపై రూ.3000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.
ఐక్యూ నియో 7 ప్రో
స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 120 వాట్స్ ఫ్లాస్ చార్జ్ సదుపాయం ఉంది.ముఖ్యంగా ఈ ఫోన్ గేమింగ్ ప్రియులు బాగా ఇష్టపడతారు. 8 జీబీ +128 జీబీ వేరింయట్ ధర రూ.35,990గా ఉంటే ప్రస్తుతం రూ.32,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరిన్ని తగ్గింపులు లభిస్తాయి.
ఐక్యూ నియో 7
మీడియా టెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్తో వచ్చే ఈ ఫోన్‌లో కూడా 120 వాట్స్ ఫ్లాష్ చార్జర్ అందబుఆటులో ఉందిటుంది. ఈ ఫోన్ ధర రూ.26,999గా ఉంది. అయితే ఈ ఫోన్ హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..