AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himalayas: అంతరిక్షం నుంచి చూస్తే హిమాలయాలు ఇంత అందంగా ఉంటాయా? ఈ అద్భుత చిత్రాన్ని మిస్ అవ్వకండి..

Himalayas: హిమాలయాలకు సంబంధించి సాధారణ ఫోటోలను చూస్తేనే ఎంతో అద్భుతంగా ఉంటాయి. అది అంతరిక్షం నుంచి చూస్తే..

Himalayas: అంతరిక్షం నుంచి చూస్తే హిమాలయాలు ఇంత అందంగా ఉంటాయా? ఈ అద్భుత చిత్రాన్ని మిస్ అవ్వకండి..
Italy
Shiva Prajapati
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 04, 2021 | 11:09 AM

Share

Himalayas: హిమాలయాలకు సంబంధించి సాధారణ ఫోటోలను చూస్తేనే ఎంతో అద్భుతంగా ఉంటాయి. అది అంతరిక్షం నుంచి చూస్తే.. వర్ణించతరమా..! తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం హిమాలయాలను ఫోటో తీశారు ఆస్ట్రోనాట్స్. ఈ ఫోటోలను చూస్తే మీరు కచ్చితంగా ముగ్ధులైపోతారు. ఐఎస్ఎస్‌లో ఉన్న ఇద్దరు వ్యోమగాములు హిమాలయాలు, ఇటలీ ఫోటోలను తీశారు. ఆ ఫోటోలను వారు ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

తెల్లటి మంచుతో కప్పబడిన హిమాలయ పర్వత శ్రేణులను వ్యోమగామి మార్క్ టి వాండే హె షేర్ చేశారు. తెల్లటి మంచు మొదటి ఫోటోను వ్యోమగామి మార్క్ టి. వాండే హె ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో తెల్లటి మంచుతో కప్పబడిన హిమాలయాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ‘హిమాలయాలలో ఎక్కడో ఒక స్పష్టమైన, ప్రకాశవంతమైన రోజు కనిపిస్తోంది. నేత ఇంతకంటే అద్భుతాన్ని చూడలేను.’ అని వాండే తన ట్వీట్‌కు క్యాప్షన్ పెట్టాడు.

సెకండ్ ఫోటోలో ఉన్నది ఇటలీ దేశంలోని టురిన్ నగరం. టురిన్ నుంచి వచ్చిన వ్యోమగామి షేన్ కింబ్రో ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘టురిన్, ఇటలీలోని ఒక నగరం. ఉత్తర ఇటలీలోని ఈ నగరం గొప్ప చరిత్ర, సంస్కృతికి ప్రసిద్ధి. ఈ అందమైన నగరాన్ని స్పేస్ స్టేషన్‌ నుంచి చూడొచ్చు.’ అని కింబ్రో క్యాప్షన్ పెట్టారు.

ఇదిలాఉంటే.. ఈ ఇద్దరు వ్యోమగాములు షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటోలు తీసిన వారిని ప్రశంసించడమే కాకుండా.. వారు తీసిన చిత్రాల వివరాలను గుర్తిస్తున్నారు. ‘మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కలుద్దాం.. నేను ఇక్కడ నివసిస్తున్నాను.’ అని టురిన్ నగరానికి చెందిన ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా, ‘హిమాలయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో’ అని మరో యూజర్ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలు తీసిన ఆస్ట్రానాట్స్‌కి అభినందనలు తెలుపుతున్నారు.

Also read:

Covid -19: పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఈ 5 ఆహార పదార్థాలు తప్పనిసరి..!

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌