Smartphone Sales 2021: చైనీయులు నచ్చని చైనా ఫోన్లు.. భారత్‌లో మాత్రం వాటిదే హవా.. నివేదికలో ఆసక్తికర విషయాలు..!
Apple: చైనా కంపెనీలు తయారు చేసిన స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. Xiaomi, Oppo, Realme, Vivo భారతదేశంలోని టాప్ 5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఉన్నాయి.
Smartphone Sales 2021: చైనా కంపెనీలు తయారు చేసిన స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. Xiaomi, Oppo, Realme, Vivo భారతదేశంలోని టాప్ 5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఉన్నాయి. ఈ బ్రాండ్‌లు ఏ దేశానికి చెందినవో ఆ దేశ ప్రజలు ఈ ఫోన్‌లను కొనడానికి ఇష్టపడడం లేదని మీకు తెలుసా? అవును ఈ కంపెనీలు అన్నీ చైనాకు చెందినవే. అయితే చైనీయులు మాత్రం వీటి స్థానంలో యాపిల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారంట. అందులోనూ ఐఫోన్-13 సిరీస్ అంటే పిచ్చిప్రేమతో తెగ కొనేస్తున్నారంట.
చైనా నంబర్ 1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా యాపిల్.. అక్టోబర్ నివేదిక ప్రకారం, ఆపిల్ చైనా టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. అంతకు ముందు ఒప్పో అగ్రస్థానంలో ఉండేంది. ఆపిల్ ఐఫోన్ చైనాలో ఎక్కువగా అమ్ముడవుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అక్టోబర్‌లో ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు గత నెలతో పోలిస్తే 46% వృద్ధిని సాధించాయని రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ తన నివేదికలో పేర్కొంది. చైనా టాప్ టెక్ కంపెనీలు Huawei, Vivo, Oppo టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించడంలో మాత్రం విఫలమయ్యాయి.
ఈ ఏడాది మార్చిలో, Apple, తరువాత Vivo, Oppo చైనాలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అవతరించాయి. అంతకుముందు మార్చి 2021లో, Vivo అగ్రస్థానంలో ఉంది. అక్టోబర్‌లో ఆపిల్ ఈ కంపెనీలన్నింటినీ అధిగమించి చైనా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అవతరించింది. డిసెంబర్ 2015 తర్వాత యాపిల్ చైనాలో టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించడం ఇదే తొలిసారి. నివేదిక ప్రకారం, Huawei కొంతకాలంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి దూరంగా ఉంది. Huawei మార్కెట్ వాటా గత 5 నుంచి బలమైన క్షీణతను చూసింది. దీంతో యాపిల్ లబ్ధి పొందిందని నివేదికలు వెల్లడించాయి.
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 బ్రాండ్‌ల లిస్టులో మాత్రం షాకింగ్ విషయాలే వెల్లడయ్యాయి. జులై, సెప్టెంబర్ మధ్య అంటే మూడవ త్రైమాసికంలో Xiaomi భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. 2021 మూడవ త్రైమాసికంలో 12 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ విక్రయాలతో Xiaomi అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) నివేదిక ప్రకారం, భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2021 మూడవ త్రైమాసికంలో సంవత్సరానికి 12 శాతం క్షీణించిందని తెలిపింది. ఈ సమయంలో భారతదేశంలో 48 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు జరిగినట్లు వెల్లడించింది.
2020లో భారతదేశంలో 5.42 కోట్ల ఫోన్‌లు అమ్ముడయ్యాయి. ఆ సమయంలో వివో టాప్ ప్లేస్‌లో ఉంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 12 శాతం తగ్గడం ఇదే తొలిసారి. కాగా, దీనికి ముందు వరుసగా గత 4 త్రైమాసికాల్లోనూ వృద్ధి నమోదైంది. లాక్‌డౌన్‌లో చిప్స్ లేకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.