ఇకపై చుక్.. చుక్.. కూత ఉండదట..!

మనం రైల్లో ప్రయాణించినా.. రైలు వచ్చినా.. చుక్ చుక్.. అనే సౌండ్ వినబడుతూ ఉంటుంది. ఆ శబ్ధం వింటూంటే.. ఒకోసారి చాలా ఆనందంగా అనిపిస్తూంటాది. చిన్నపిల్లలు కూడా.. ఈ శబ్ధం చేస్తూ.. ఆడుకుంటూంటారు. ఈ చుక్.. చుక్.. అనే శబ్దంపై చాలా పాటలు కూడా వచ్చాయి కూడా. ఈ సౌండ్ విన్నా.. ఈ పదం చదివినా.. ఆ పాటలు గుర్తొచ్చాయి కదా. ఎంతో.. మంది ప్రయాణికులను సుదూర గమ్యాలకు చేర్చేది రైలు. ఇక ఈ విషయం పక్కన […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:20 am, Wed, 18 September 19
ఇకపై చుక్.. చుక్.. కూత ఉండదట..!

మనం రైల్లో ప్రయాణించినా.. రైలు వచ్చినా.. చుక్ చుక్.. అనే సౌండ్ వినబడుతూ ఉంటుంది. ఆ శబ్ధం వింటూంటే.. ఒకోసారి చాలా ఆనందంగా అనిపిస్తూంటాది. చిన్నపిల్లలు కూడా.. ఈ శబ్ధం చేస్తూ.. ఆడుకుంటూంటారు. ఈ చుక్.. చుక్.. అనే శబ్దంపై చాలా పాటలు కూడా వచ్చాయి కూడా. ఈ సౌండ్ విన్నా.. ఈ పదం చదివినా.. ఆ పాటలు గుర్తొచ్చాయి కదా. ఎంతో.. మంది ప్రయాణికులను సుదూర గమ్యాలకు చేర్చేది రైలు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. రైలు వచ్చేటప్పుడు కానీ.. వెళ్లేటప్పుడు కానీ చుక్.. చుక్.. అని శబ్దం చేసుకుంటూ పోతుంది. అయితే.. ఈ సంవత్సం డిసెంబర్ నెల కల్లా రైళ్లు ఆ శబ్ధం లేకుండా ప్రయాణం చేస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

అలాగే.. రైళ్ల చివర్లలో వున్న కార్స్‌ని తొలగించి రైలుపైన కరెంట్ తీగల ద్వారా విద్యుత్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పవర్ కార్ స్థానంలో బోగీ ఏర్పాటు చేసి.. ప్రయాణికుల లగేజీ, గార్డులకు వాడతామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ఒక సైలెంట్ జనరేటర్ ఉంచనున్నారు. ప్రస్తుతం పవర్ కార్లు 105 డెసిబిల్స్ శబ్దం చేస్తుండగా ఇకపై అది ఉండదని.. రైల్వే బోర్డు అధికారి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ సైలెంట్ మోడ్‌ వల్ల రూ.800 కోట్ల విద్యుత్‌ను ఆదా చేస్తామన్నారు. ఈ టెక్నాలజీని 2015లోనే ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రేవేశపెట్టామన్నారు.