AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Tips: ఫోన్ స్లో అవుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి.. మునుపటి కంటే వేగంగా పనిచేస్తుంది

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్‌ (Smart Phone) ప్రపంచ గతిని మార్చింది. అరచేతిలో ప్రపంచమంతా చూపించే టెక్నాలజీ (Technology) అందుబాటులోకి వచ్చింది. వీటన్నింటికి స్మార్ట్ ఫోన్ అనివార్యమైంది. మొబైల్ ఫోన్ మనిషి శరీరంలో ఒక భాగమైపోయిందనడంలో..

Phone Tips: ఫోన్ స్లో అవుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి.. మునుపటి కంటే వేగంగా పనిచేస్తుంది
Smart Phones
Ganesh Mudavath
|

Updated on: Mar 21, 2022 | 8:38 AM

Share

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్‌ (Smart Phone) ప్రపంచ గతిని మార్చింది. అరచేతిలో ప్రపంచమంతా చూపించే టెక్నాలజీ (Technology) అందుబాటులోకి వచ్చింది. వీటన్నింటికి స్మార్ట్ ఫోన్ అనివార్యమైంది. మొబైల్ ఫోన్ మనిషి శరీరంలో ఒక భాగమైపోయిందనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. ఈ క్రమంలో ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దేశంలో 1.2 బిలియ‌న్ మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే వాటి వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో అప్పుడప్పుడు ఫోన్‌ నెమ్మదిస్తుంటుంది. ఫోన్ స్లో(Phone Slow) గా మారడంతో వేగవంతంగా పనిచేయడం కుదరదు. అయితే ఇలా ఉన్నట్టుండి స్లోగా మారడానికి కారణమేంటి.. తిరిగి వేగంగా పని చేయాలంటే ఏం చేయాలి.. ఎలాంటి టిప్స్ పాటించాలో చూద్దాం. ఫోన్లలో అనవసరమైన ఫోటోలు, వీడియోలు నిండిపోవడం వల్ల వేగం తగ్గుతుంది. వాటిని డిలీట్ చేయడం, కొన్ని సెట్టింగ్స్ ను మార్చడం ద్వారా ఫోన్ ఫాస్ట్‌గా పనిచేసేలా చేయవచ్చు. దీని కోసం ఫోన్ సెట్టింగ్స్ కు వెళ్లి.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ వేగంగా పనిచేయాలంటే వాటిని నిరంతరం అప్‌డెట్ చేస్తూ ఉండాలి. దీనికి గూగుల్ ప్లే స్టోర్ వెళ్ళీ ఏవైనా అప్‌డేట్ చేయాల్సి ఉందేమో చూడాలి. ఎక్కువ స్టోరేజిని ఆక్రమించే గ్రాఫిక్స్‌ గేమ్స్‌‌ను వాడకపోవడం మంచిది.

ఫోన్‌లో పెద్దగా వాడని అప్లికేషన్లను తొలగించడం, కేవలం అవసరమైన అప్లికేషన్లు మాత్రమే డౌన్లోడ్‌ చేసుకోవటం, ఫొటోలు, వీడియోల వంటివాటిలో ఏవైనా డూప్లికేట్‌ ఫైళ్లు ఉంటే గుర్తించి వాటిని తొలగించాలి. తరచూ వాట్స్‌పకి వచ్చే ఫార్వార్డెడ్‌ మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు తొలగించడం, ఎప్పటికప్పుడు ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ తగినంత మొత్తంలో స్పేస్ ఉండేలా జాగ్రత్త వహించడం చేయగలిగితే చాలా వరకూ మన ఫోన్‌ పనితీరు మెరుగ్గా ఉండేలా చూసుకోవచ్చు. ఫోన్ ఎందుకు స్లో అయిందో అర్ధం కాకపోయినట్లయితే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మన ముఖ్యమైన డేటా మొత్తాన్ని ఇంటర్నల్‌ స్టోరేజ్‌ నుంచి మెమరీ కార్డులోకి గానీ, కంప్యూటర్లోకి గానీ కాపీ చేసుకొని ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ చెయ్యడం మంచిది. ప్రస్తుతం మనం ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న అప్లికేషన్లు, ఆ యాప్‌ డేటా, కాంటాక్టులు, కాల్‌ లాగ్స్‌, మెసేజ్‌లు అన్నీ ఉన్నవి ఉన్నట్లు బ్యాకప్‌ తీయగలిగే అప్లికేషన్లు కూడా లభిస్తున్నాయి కాబట్టి వాటి సాయంతో ముఖ్యమైన డేటాని బ్యాకప్‌ తీసుకోండి. ఫ్యాక్టరీ రీసెట్‌ చేశాక వాటిని తిరిగి రీస్టోర్‌ చేసుకోవచ్చు.

Also Read

Viral Video: తోకతో గిటార్‌ వాయిస్తోన్న కుక్క.. మ్యూజిక్‌ బ్యాండ్‌ స్టార్ట్‌ చేద్దామంటోన్న నెటిజన్లు..

Funny Video: బిల్డప్ రాజా దూల తీరింది.. స్టంట్స్ చేయబోయి పళ్లు రాలగొట్టుకున్నాడు..!

Ratan Tata: తగ్గేదే లే అంటున్న రతన్ టాటా.. చేతులెత్తేసిన అమెరికా దిగ్గజం..!