Aadhaar-Phone Link: ఆధార్‌కు మొబైల్ లింక్ చేయడం ఎలా? చాలా సింపుల్.. ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి చాలు..
మీరు ప్రభుత్వ సేవలను పొందడానికి, లేకపోతే వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేశారనుకోండి. మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ నంబర్ ను ఎంటర్ చేస్తేనే మీ పని ముందుకు సాగుతుంది. కాబట్టి ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. చాలామందికి ఈ విషయంపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు.
దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైంది. ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రధాన గుర్తింపు సాధనం కూడా ఇదే. ఈ కార్డు లేకపోతే దాదాపు మనకు గుర్తింపు కూడా లేనట్టే. దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం 12 అంకెల నంబర్ తో వీటిని మంజూరు చేసింది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆధార్ కార్డులో మన పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఇతర వివరాలు ఉంటాయి. వాటిలో అక్షర దోషాలు లేకుండా సక్రమంగా ఉన్నప్పుడే మనకు ఏ ఇబ్బంది లేకుండా పథకాలు అందుతాయి. ముఖ్యంగా ఆధార్ కార్డుకు మన వ్యక్తిగత మొబైల్ నంబర్ ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి.
అన్నింటికీ ఆధారం..
మీరు ప్రభుత్వ సేవలను పొందడానికి, లేకపోతే వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేశారనుకోండి. మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ నంబర్ ను ఎంటర్ చేస్తేనే మీ పని ముందుకు సాగుతుంది. కాబట్టి ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. చాలామందికి ఈ విషయంపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైన సమయంలో పనులు జరగక అవస్థలు పడుతున్నారు. సాధారణంగా మనం ఆధార్ కార్డులో కొన్ని మార్పులను ఆన్ లైన్ లో చేసుకునే అవకాశం ఉంది. ప్రతిసారి ఆధార్ కేంద్రానికి వెళ్లకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఆన్ లైన్ లో ఆధార్ కార్డులో ఏమార్పు చేయాలన్నా దానికి మొబైల్ నంబర్ లింక్ అవ్వాలి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి.
మొబైల్ నంబర్ లింక్ చేయడం చాలా సులభం..
మీరు ఇప్పటి వరకూ మొబైల్ నంబర్ ను ఆధార్ కార్డుకు లింక్ చేసుకోకపోయినా, లేకపోతే మీ మొబైల్ పడిపోవడం, పాడైపోవడం వల్ల కొత్త నంబర్ ను తీసుకున్నా వెంటనే ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ లేదా ఆధార్ కేంద్రానికి వెళ్లి వెంటనే నంబర్ ను లింక్ చేసుకోండి. ఈ కింద తెలిపిన పద్ధతులను అనుసరిస్తే మీ పని చాాలా సులభంగా పూర్తవుతుంది.
- సమీపంలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ కేంద్రానికి వెళ్లండి.
- మీతో పాటు మీ ఆధార్ కార్డును తీసుకువెళ్లండి. మొబైల్ నంబర్ ను లింక్ చేయడానికి ఎలాంటి పత్రాలు ఇవ్వనవసరం లేదు.
- ఆధార్ కేంద్రంలో ఆధార్ అప్‌డేట్ లేదా కరెక్షన్ ఫారం తీసుకుని, వివరాలు నింపండి.
- అక్కడ ఉన్న అధికారికి ఆ ఫారం అందజేయండి.
- ఆ అధికారి మీ వేలిముద్రలను ధ్రువీకరిస్తారు.
- ఆధార్ కార్డ్‌లో ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి రూ.50 చెల్లించాలి.
- తర్వాత మీ నంబర్ అప్‌డేట్ అవుతుంది.
- మీకు రశీదు ఇస్తారు. దానిలో అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) ఉంటుంది. దీని ద్వారా మీరు ఆధార్ అప్‌డేట్ స్థితిని పరిశీలించవచ్చు.
- మీ మొబైల్ నంబర్ 90 రోజుల్లో యూఐడీఏఐ డేటాబేస్‌లో అప్‌డేట్ అవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..