AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో Wi-Fi పాస్‌వర్డ్ మర్చిపోయారా? ఈ ట్రిక్స్​ తెలిస్తే సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంట్లో Wi-Fi కనెక్షన్ తప్పనిసరిగా మారిపోయింది. ఆఫీస్ పనులు చేసుకోవాలన్నా, పిల్లలు ఆన్‌లైన్‌లో చదువుకోవాలన్నా, టీవీలో సినిమాలు చూడాలన్నా, ఇంట్లోని స్మార్ట్ గ్యాడ్జెట్లను ఉపయోగించాలన్నా ఇంటర్నెట్ అవసరం. అయితే ప్రతిసారీ పొడవైన Wi-Fi పాస్‌వర్డ్ టైప్ చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా పాస్‌వర్డ్ గుర్తులేనప్పుడు కొత్త ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను కనెక్ట్ చేయడం కష్టంగా మారుతుంది. కానీ ప్రతిసారీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన పద్ధతులతో పాస్‌వర్డ్ టైప్ చేయకుండానే మీ డివైజ్‌లను Wi-Fiకి కనెక్ట్ చేసుకోవచ్చు.

ఇంట్లో Wi-Fi పాస్‌వర్డ్ మర్చిపోయారా? ఈ ట్రిక్స్​ తెలిస్తే సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు
Connect To Home Wi Fi Without Typing A Password
Nikhil
|

Updated on: Oct 30, 2026 | 8:40 PM

Share

Wi-Fi పాస్​ వర్డ్​ మర్చిపోయినా కనెక్ట్ చేసుకోవడం కోసం LAN కేబుల్, WPS బటన్, Wi-Fi QR కోడ్ వంటి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని పద్ధతులు రూటర్ సెట్టింగ్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడితే, మరికొన్ని కొత్త డివైజ్‌లను త్వరగా నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడానికి సహాయపడతాయి. అయితే ఈ సదుపాయాలు మీ రూటర్, స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో అందుబాటులో ఉన్నాయో లేదో ముందుగా తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలియని వ్యక్తులతో Wi-Fi యాక్సెస్ పంచుకునేటప్పుడు భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

LAN కేబుల్, WPS బటన్‌

Wi-Fi పాస్‌వర్డ్ టైప్ చేయకుండా ఇంటర్నెట్ ఉపయోగించేందుకు LAN కేబుల్ ఒక మార్గం. ఇందుకోసం రూటర్ నుంచి LAN కేబుల్‌ను తీసుకుని కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయాలి. అనంతరం బ్రౌజర్ ఓపెన్ చేసి అడ్రస్ బార్‌లో రూటర్ IP అడ్రస్ ఎంటర్ చేయాలి. రూటర్‌పై ఇచ్చిన లాగిన్ వివరాలతో సెట్టింగ్స్‌లోకి వెళ్లి Wi-Fi సెక్షన్‌ను ఓపెన్ చేయవచ్చు. అక్కడ నెట్‌వర్క్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. అయితే పాస్‌వర్డ్‌ను చూడటానికి రూటర్ అడ్మిన్ లాగిన్ అవసరం కావచ్చు.

మరో సులభమైన మార్గం WPS (Wi-Fi Protected Setup) బటన్. సాధారణంగా ఈ బటన్ రూటర్ వెనుక లేదా పక్క భాగంలో ఉంటుంది. రూటర్‌లో WPS సదుపాయం ఉంటే, ఆ బటన్‌ను కొన్ని సెకన్ల పాటు నొక్కాలి. ఆ తర్వాత మీ ఫోన్ లేదా ఇతర డివైజ్‌లో Wi-Fi సెట్టింగ్స్ ఓపెన్ చేసి WPS ద్వారా కనెక్ట్ అయ్యే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అయితే అన్ని రూటర్లు, ఫోన్లు ఈ సదుపాయానికి మద్దతు ఇవ్వవు.

QR కోడ్ స్కాన్ చేస్తే చాలు..

Wi-Fiకి కనెక్ట్ కావడానికి QR కోడ్ పద్ధతి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే Wi-Fiకి కనెక్ట్ అయి ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో Settings ఓపెన్ చేసి Wi-Fi సెక్షన్‌లోకి వెళ్లాలి. కనెక్ట్ అయిన నెట్‌వర్క్ పేరుపై క్లిక్ చేస్తే Share లేదా QR Code ఆప్షన్ కనిపించవచ్చు. దాన్ని ఎంచుకుంటే స్క్రీన్‌పై QR కోడ్ వస్తుంది. మరో ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే పాస్‌వర్డ్ టైప్ చేయకుండానే Wi-Fiకి కనెక్ట్ కావచ్చు. ఈ పద్ధతి ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యుల ఫోన్లను కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే QR కోడ్‌లో Wi-Fi వివరాలు ఉండే అవకాశం ఉన్నందున దాన్ని నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే షేర్ చేయాలి.

Follow Us
ఇంట్లో Wi-Fiకి పాస్‌వర్డ్ లేకుండానే కనెక్ట్ కావ్వొచ్చు
ఇంట్లో Wi-Fiకి పాస్‌వర్డ్ లేకుండానే కనెక్ట్ కావ్వొచ్చు
పశువుల కోసం వచ్చి సడెన్‌గా ఇంట్లో దూరిన సింహం.. మహిళ ఏం చేసిదంటే
పశువుల కోసం వచ్చి సడెన్‌గా ఇంట్లో దూరిన సింహం.. మహిళ ఏం చేసిదంటే
రూ.10 లక్షల లోపు కారు కొనాలనుకుంటున్నారా?
రూ.10 లక్షల లోపు కారు కొనాలనుకుంటున్నారా?
మీ కారు మైలేజీని పెంచుకోవాలనుకుంటున్నారా? ఎవ్వరు చెప్పని ట్రిక్స్
మీ కారు మైలేజీని పెంచుకోవాలనుకుంటున్నారా? ఎవ్వరు చెప్పని ట్రిక్స్
ఇప్పటివరకు ఆ స్టార్ హీరోతో కలిసి నటించని రాజీవ్ కనకాల..
ఇప్పటివరకు ఆ స్టార్ హీరోతో కలిసి నటించని రాజీవ్ కనకాల..
సన్‌ఫ్లవర్ ఆయిల్ vs రైస్ బ్రాన్ ఆయిల్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్‌ఫ్లవర్ ఆయిల్ vs రైస్ బ్రాన్ ఆయిల్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
కేదార్‌నాథ్ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు.. ఫత్వా జారీ
కేదార్‌నాథ్ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు.. ఫత్వా జారీ
రోడ్డుపై దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన విద్యార్థి
రోడ్డుపై దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన విద్యార్థి
పండగ వేళ బంపర్‌ ఆఫర్‌.. ఈ కారు ధర ఏకంగా రూ.34 లక్షల వరకు తగ్గింది
పండగ వేళ బంపర్‌ ఆఫర్‌.. ఈ కారు ధర ఏకంగా రూ.34 లక్షల వరకు తగ్గింది
ఎంత కష్టమొచ్చే.. గర్భిణీకి పురిటి కష్టాలు..
ఎంత కష్టమొచ్చే.. గర్భిణీకి పురిటి కష్టాలు..