AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గేమింగ్​ లవర్స్​ కోసం Honor కొత్త ఫోన్లు.. ఫీచర్లు, ధర తెలిస్తే ఎగిరిగంతేస్తారు

గేమింగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హానర్ సంస్థ మూడు కొత్త మోడళ్లను పరిచయం చేసింది. చైనాలోని హాంగ్‌జౌలో నిర్వహించిన ‘HONOR WIN Gaming Universe Carnival’ ఈవెంట్‌లో HONOR WIN 2, HONOR WIN RT2, HONOR WIN Turbo2 ఫోన్లను విడుదల చేసింది. అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, శక్తివంతమైన ప్రాసెసర్లు, భారీ బ్యాటరీలు, ప్రత్యేక కూలింగ్ టెక్నాలజీ వీటి ప్రధాన ఆకర్షణలు.

గేమింగ్​ లవర్స్​ కోసం Honor కొత్త ఫోన్లు.. ఫీచర్లు, ధర తెలిస్తే ఎగిరిగంతేస్తారు
Honor Win 2, Win Rt2 And Win Turbo2
Nikhil
|

Updated on: Oct 23, 2026 | 8:10 PM

Share

గేమింగ్ సమయంలో వేగవంతమైన స్పందన, స్థిరమైన ఫ్రేమ్ రేట్లు, వేడిని నియంత్రించే వ్యవస్థపై హానర్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మూడు ఫోన్లలోనూ 2K 185Hz Oasis డిస్‌ప్లే టెక్నాలజీ, MagicOS 11 ఉన్నాయి. కెమెరాలు, ఛార్జింగ్ వేగం, ప్రాసెసర్ సామర్థ్యం వంటి అంశాల్లో మాత్రం మోడళ్ల మధ్య తేడాలున్నాయి. ముఖ్యంగా రెండు మోడళ్లలో 12,070mAh బ్యాటరీని అందించడం విశేషం.

Snapdragon ప్రాసెసర్లు..

ఈ సిరీస్‌లో HONOR WIN 2 ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలుస్తోంది. ఇందులో Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్‌సెట్, LPDDR5X Ultra RAM, UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. Honor Phantom Engine ద్వారా AI గ్రాఫిక్స్ రెండరింగ్, రే ట్రేసింగ్‌కు సపోర్ట్ అందించారు. HONOR WIN RT2లో Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉండగా, WIN Turbo2లో Snapdragon 8s Gen 4 చిప్‌సెట్, E2 ఎనర్జీ మేనేజ్‌మెంట్ చిప్ ఉన్నాయి.

మూడు ఫోన్లలోని 2K 185Hz డిస్‌ప్లేలు 40కి పైగా గేమ్స్‌లో అధిక ఫ్రేమ్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. 5,920Hz PWM డిమ్మింగ్, 5,000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. WIN 2, WIN RT2లో Dongfeng Twin Star Turbine Cooling System ద్వారా డ్యూయల్ ఫ్యాన్లతో వేడిని నియంత్రిస్తారు. Turbo2లో ఫ్యాన్‌లెస్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు.

12,070mAh బ్యాటరీ..

బ్యాటరీ సామర్థ్యంలో WIN RT2, WIN Turbo2 ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ రెండు మోడళ్లలో 12,070mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీలు ఉన్నాయి. Turbo2లో 90W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. WIN 2లో 10,100mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి.

కెమెరాల విషయానికి వస్తే WIN 2, WIN RT2లో 200MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. Turbo2లో 50MP Sony ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్, 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. మూడు ఫోన్లకూ IP68, IP69, IP69K రేటింగ్‌లు ఉన్నట్లు సంస్థ పేర్కొంది.

ధరల విషయానికి వస్తే, HONOR WIN Turbo2 ధర 3,199 యువాన్ల నుంచి (సుమారు రూ.45,309), WIN RT2 ధర 4,199 యువాన్ల నుంచి (సుమారు రూ.59,375), WIN 2 ధర 5,499 యువాన్ల నుంచి (సుమారు రూ.77,760) ప్రారంభమవుతాయి. WIN 2లో 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర 7,999 యువాన్లు (సుమారు రూ.1,13,110). ప్రస్తుతం ఈ ఫోన్లు చైనాలో అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లో విడుదలపై అధికారిక సమాచారం లేదు.

Follow Us