AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fingerprint Lock: ఫింగర్‌ ప్రింట్‌ తాళాలు వచ్చేశాయ్‌..కీ లేకున్నా వేలిముద్రతో మీ ఇంటి తాళం ఓపెన్‌!

కొన్నిసార్లు లాక్, కీ రెండింటినీ నిర్వహించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంటికి తాళం వేసినా తాళం చెవిని సరైన చోట ఉంచడంలో టెన్షన్ పడవచ్చు. అటువంటి పరిస్థితిలో ఇంటి భద్రత కూడా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో తాళం చెవి లేని సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. చివరకు తాళాన్ని పగులగొట్టే పరిస్థితి వస్తుంటుంది. ఈ సమస్యను నివారించడానికి మీరు మీ ఇంటికి

Fingerprint Lock: ఫింగర్‌ ప్రింట్‌ తాళాలు వచ్చేశాయ్‌..కీ లేకున్నా వేలిముద్రతో మీ ఇంటి తాళం ఓపెన్‌!
Fingerprint Biometric Padlock
Subhash Goud
|

Updated on: Jun 23, 2024 | 4:26 PM

Share

కొన్నిసార్లు లాక్, కీ రెండింటినీ నిర్వహించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంటికి తాళం వేసినా తాళం చెవిని సరైన చోట ఉంచడంలో టెన్షన్ పడవచ్చు. అటువంటి పరిస్థితిలో ఇంటి భద్రత కూడా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో తాళం చెవి లేని సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. చివరకు తాళాన్ని పగులగొట్టే పరిస్థితి వస్తుంటుంది. ఈ సమస్యను నివారించడానికి మీరు మీ ఇంటికి వేలిముద్ర బయోమెట్రిక్ ప్యాడ్‌లాక్‌ను కొనుగోలు చేయవచ్చు. కీని తెరవడానికి బదులుగా, ఈ లాక్ సిస్టమ్ మీ వేలిముద్రలతో ఓపెన్‌ చేసుకోవచ్చు. ఒక వేళ మీరు కీ లేకున్నా వేలిముద్ర ద్వారా తీయవచ్చు.

ఇది కూడా చదవండి: Annual Salary: గౌతమ్ అదానీకి రూ.9.26 కోట్ల జీతం..మరి ముఖేష్ అంబానీకి వేతనం ఎంతో తెలుసా?

హెర్లిచ్ హోమ్స్ ఫింగర్‌ప్రింట్ ప్యాడ్‌లాక్:

ఇవి కూడా చదవండి

ఈ ఫింగర్ ప్రింట్ ప్యాడ్‌లాక్ మీ చాలా సమస్యలను పరిష్కరించగలదు. దీనితో మీరు వేలిముద్రతో మీ లాక్‌ని అన్‌లాక్ చేయవచ్చు. ఇందులో ఒకేసారి ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు వేయవచ్చు. మీరు దీన్ని USB కేబుల్‌తో ఛార్జ్ చేయవచ్చు. ఈ లాక్‌ప్యాడ్ అసలు ధర రూ. 3,299 అయినప్పటికీ, మీరు దీన్ని 53 శాతం తగ్గింపుతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ నుండి కేవలం రూ. 1,549కి కొనుగోలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Airtel 9 Plan: ఎయిర్‌టెల్‌ నుంచి అద్భుతమైన ప్లాన్‌.. కేవలం రూ.9తో అపరిమిత డేటా

ఆర్కినిక్స్ రగ్గడ్ స్మార్ట్ ఫింగర్ ప్రింట్ ప్యాడ్‌లాక్

ఈ ఫింగర్‌ప్రింట్ ప్యాడ్‌లాక్ గొప్పదనం ఏమిటంటే ఇది 10 వేలిముద్రలకు మద్దతు ఇస్తుంది. అంటే మీరు ప్రతి కుటుంబ సభ్యుల వేలిముద్రను కనెక్ట్ చేయవచ్చు. దీంతో కుటుంబ సభ్యులు ఒకరు అందుబాటులో లేకపోయినా, వేలిముద్ర అనుసంధానించబడిన మరొకరు దాన్ని తెరవగలరు. ఈ లాక్ సిస్టమ్‌లు సాధారణ లాక్ సిస్టమ్‌ల కంటే కొంచెం ఖరీదైనవి కానీ పూర్తి భద్రతను కలిగి ఉంటాయి. ఈ లాక్ సిస్టమ్ అసలు ధర రూ. 6,999 అయినప్పటికీ, మీరు అమెజాన్ నుండి 47 శాతం తగ్గింపుతో కేవలం రూ. 3,690కి కొనుగోలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఇంట్లో చపాతీలు ఎలా తయారు చేస్తారో తెలుసా..?

Escozor స్మార్ట్ హెవీడ్యూటీ ఫింగర్ ప్రింట్ ప్యాడ్‌లాక్

ఈ ఫింగర్ ప్రింట్ ప్యాడ్‌లాక్ యాప్ సపోర్ట్‌తో వస్తుంది. అంటే మీరు దాని యాప్‌ని Google Play Store లేదా Apple App Store నుండి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ నుండి మీ లాక్ సిస్టమ్‌ను నియంత్రించవచ్చు. ఈ లాక్‌ప్యాడ్ అసలు ధర రూ. 9,500 అయితే మీరు దీన్ని అమెజాన్ నుండి కేవలం రూ.6,990కి కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి