- Telugu News Photo Gallery AC Blast Signs: Learn How to Identify Gas Leaks in Your Air Conditioner and Take Action
AC Blast Signs: ఏసీ పేలుడుకు ముందు కనిపించే లక్షణాలు ఇవే.. బీకేర్ ఫుల్!
ఎండల వేడిమి కారణంగా నేటి కాలంలో ప్రతి ఇంట్లో ఏసీ వినియోగిస్తున్నారు. చాలా ఇళ్లలో రోజులో ఎక్కువ సమయం AC నడుస్తూనే ఉంటాయి. దీంతో ఏసీలో టెక్నికల్ సమస్యలు తలెత్తుతుంటా. సకాలంలో వీటిని నివారించకుంటే ఏసీ ఏక్షణమైన పేలే ప్రమాదం ఉంది..
Updated on: Jun 23, 2024 | 1:57 PM

ఎండల వేడిమి కారణంగా నేటి కాలంలో ప్రతి ఇంట్లో ఏసీ వినియోగిస్తున్నారు. చాలా ఇళ్లలో రోజులో ఎక్కువ సమయం AC నడుస్తూనే ఉంటాయి. దీంతో ఏసీలో టెక్నికల్ సమస్యలు తలెత్తుతుంటా. సకాలంలో వీటిని నివారించకుంటే ఏసీ ఏక్షణమైన పేలే ప్రమాదం ఉంది.

చాలా మందికి ఏసీ మెషిన్ల వల్ల తలెత్తే సమస్యల గురించి అవగాహన ఉండదు. ఫలితంగా ఏసీ పేలుళ్లు సంభవిస్తుంటాయి. ఏసీ గ్యాస్ లీక్ అవ్వడం మీరు గమనించకపోతే పెద్ద ప్రమాదం సంభవిస్తుంది.అలాగే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏసీ గ్యాస్ లీకేజీలు, పేలుళ్లు సంభవించవచ్చు. ఏసీ గ్యాస్ లీకేజీ లక్షణాలను తెలుసుకుంటే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. ఏసీ గ్యాస్ లీకేజీని ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..

చాలా సార్లు ఏసీ నడుస్తున్నప్పుడు మెషిన్ లోపల వింత శబ్దం వస్తుంటుంది. దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇది AC మెషిన్ గ్యాస్ లీకేజీకి సంకేతం కావచ్చు. ఏసీని రన్ చేసిన తర్వాత ఒక్కోసారి మెషిన్‌లో కుళ్లిన వాసన వస్తుంటుంది. ఇది గ్యాస్ లీక్‌కి సంకేతం కూడా కావచ్చు. ఇలావుంటే మాత్రం ఖచ్చితంగా ఏసీని ఆఫ్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి.

AC గ్యాస్ వాసన రిఫ్రిజిరేటర్ లాగా కుళ్ళిన వాసన మాదిరి ఉంటుంది. కాబట్టి ఏసీ మెషీన్‌ను రన్ చేసిన తర్వాత కుళ్ళిన వాసనను గుర్తిస్తే ఆలస్యం చేయవద్దు. ఇది ఏసీ గ్యాస్ లీకేజీకి సంకేతం.

AC చాలా సేపు ఆన్‌లో ఉంటే కంప్రెసర్ వేడిగా మారుతుంది. ఇది పేలుడు లేదా గ్యాస్ లీక్ సమస్యకు కారణం అవుతుంది. కాబట్టి కొన్ని గంటలపాటు ఏసీని రన్ చేసిన తర్వాత, కాసేపు ఆపి మళ్లీ వాడుకుంటూ ఉండాలి. ప్రతి 3-4 నెలలకోసారి ఏసీ మెషీన్‌కు సర్వీస్ చేయడం మర్చిపోకూడదు.




