Instagram: ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను డౌన్ లోడ్ చేయడం ఎలా? ఇలా చేస్తే చాలా ఈజీ.. ట్రై చేయండి..
చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ లో వస్తున్న రీల్స్, వీడియోలను సేవ్ చేసుకొని, డౌన్ లోడ్ చేసుకోవాలనుకొంటుంటారు. కానీ సేవింగ్ కుదురుతుంది కానీ.. వాటిని ఫోన్లోకి డౌన్ లోడ్ చేసుకోవడం కదరదు. ఎందుకంటే ఇన్ స్టా డైరెక్ట్ గా యాప్ నుంచి వీడియోలను డౌన్ లోడ్ చేసుకొనే ఆప్షన్ ఇవ్వలేదు. అయితే కొన్ని ప్రత్యేకమైన విధానాల ద్వారా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
ప్రస్తుతం మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం, అభిప్రాయం చెప్పడం, విమర్శలు చేయడం, ఇష్టమైన వాటిని ప్రోత్సహించడం ఇలా ఒకటేమిటి సర్వం, సర్వస్వం సోషల్ మీడియా అయిపోయింది. వాటిల్లో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటివి అధిక ప్రజాదరణ పొందుతున్నాయి. వీటిల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కి, ఫోటోలు షేరింగ్ కి బాగా పాపులర్ అయ్యింది. యువత చిన్న చిన్న వీడియోలతో రీల్స్ చేసి బాగా పాపులర్ అవుతున్నారు. బ్రాండ్ ప్రమోషన్లు కూడా బాగా జరుగుతుంటాయి. ఎవరికి నచ్చిన కంటెంట్ ను వారు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ లో వస్తున్న రీల్స్, వీడియోలను సేవ్ చేసుకొని, డౌన్ లోడ్ చేసుకోవాలనుకొంటుంటారు. కానీ సేవింగ్ కుదురుతుంది కానీ.. వాటిని ఫోన్లోకి డౌన్ లోడ్ చేసుకోవడం కదరదు. ఎందుకంటే ఇన్ స్టా డైరెక్ట్ గా యాప్ నుంచి వీడియోలను డౌన్ లోడ్ చేసుకొనే ఆప్షన్ ఇవ్వలేదు. అయితే కొన్ని ప్రత్యేకమైన విధానాల ద్వారా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
ఆన్ లైన్ టూల్స్ లేదా థర్డ్ పార్టీ యాప్స్..
ఇన్‌స్టాగ్రామ్ లోని రీల్స్, వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవడానికి రెండు ప్రధానమైన విధానాలు అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటంటే కొన్ని వెబ్ సైట్లను ద్వారా ఆన్ లైన్ టూల్స్ వినియోగించుకొని డౌన్ లోడ్ చేసుకోవడం, లేదా థర్డ్ పార్టీ యాప్స్ ను వినియోగించుకొని డౌన్ లోడ్ చేసుకోవడం. అయితే థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా డౌన్ లోడ్ చేయడం అంటే మన ప్రైవసీ భద్రత ఉండదు. అందుకే మనం కొన్ని వెబ్ టూల్స్ ని వినియోగించి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను ఎలా డౌన్ లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం..
- మొదటిగా మీరు ఇన్‌స్టాగ్రామ్ యాప్ ను మీ ఫోన్లో ఓపెన్ చేయండి.
- మీరు డౌన్ లోడ్ చేయాలనుకొంటున్న వీడియోను ఎంపిక చేసుకోండి.
- ఆ వీడియోకు పైన కుడిచేతి వైపు కనిపిస్తున్న మూడు చుక్కలను ప్రెస్ చేసి.. వచ్చిన ఆప్షన్లలో నుంచి కాపీ లింక్ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని వీడియో లింక్ ను కాపీ చేయండి.
- ఇన్‌స్టాగ్రామ్ వీడియోను డౌన్ లోడ్ చేయగలిగే ఏదైనా వెబ్ సైట్లోకి వెళ్లి దానిలో మీరు కాపీ చేసి వీడియో లింక్ ను పేస్ట్ చేయండి.
- ఆ తర్వాత డౌన్ లోడ్ అనే బటన్ పై క్లిక్ చేసి వీడియోను డౌన్ లోడ్ చేయండి.
ఇవి గుర్తుంచుకోండి..
ఈ వెబ్ టూల్స్ సాధారణంగా ప్రైవేట్ ఖాతాల నుంచి కాకుండా పబ్లిక్ ఖాతాల నుంచి డౌన్‌లోడ్‌లను అనుమతిస్తాయని గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించడం సౌకర్యంగా ఉంటే, మీరు మీ పరికరం యాప్ స్టోర్‌లో అందుబాటులో టాప్ రేటింగ్ యాప్ లను వినియోగించుకోవచ్చు. అక్కడ కూడా ఇదే విధానం ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం.. దానిలో ఇప్పటికే కాపీ చేసి ఉంచిన వీడియో లింక్ ను పేస్ట్ చేయడం.. వీడియోను డౌన్ లోడ్ చేయడం అంతే. అయితే యాప్ ద్వారా మీరు డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. దీనిలో మీ ప్రైవసీకి గ్యారంటీ ఉండదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..