Car maintenance: మీ కారు బ్రేక్ ఫెయిల్యూర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇది మాత్రం మర్చిపోవద్దు..
ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు తరచూ మనకు వినిపించే సమస్య బ్రేక్ ఫెయిల్యూర్. అయితే ఇది ఎందుకు జరుగుతుంది? అసలు బ్రేక్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? దేని కారణంగా అది జరుగుతుంది? దానిని ఎలా నివారించాలి?
మన దేశంలో రోడ్డు ప్రమాదాలు చాలా సాధారణం అయిపోయాయి. రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. న్యూస్ చానల్ చూసినా, పేపర్ చూసినా ఆ విషయం మనకు స్పష్టం అవుతుంది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది? అసలు బ్రేక్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? దేని కారణంగా అది జరుగుతుంది? దానిని ఎలా నివారించాలి? వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం..
మంచి వర్కింగ్ కండిషన్లో ..
బండిలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయడానికి వీలవుతుంది. వాటిల్లో ప్రధానమైనది బ్రేకింగ్ వ్యవస్థ. మీరు ఓ కారును కలిగి ఉన్నారనుకోండి. తప్పనిసరిగా మీరు ఈ బ్రేక్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకోవాలి. అందులో ఒక మార్గం ఏంటంటే బ్రేక్ ఆయిల్ లెవెల్ ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.
బ్రేక్ ఆయిల్ ఏం చేస్తుంది..
మీ కారులో బ్రేక్ ఆయిల్ ఏం చేస్తుందంటే.. ఎప్పుడైతే మీరు బ్రేక్ పెడల్ నొక్కుతారో అప్పుడు అది ఆ ఒత్తిడిని బ్రేక్ ప్యాడ్లకు, రోటార్ల వరకూ తీసుకెళ్లి రోటార్ తిరగకుండా చేస్తుంది. ఒక వేళ బ్రేక్ ఆయిల్ లేకపోతే బ్రేకింగ్ వ్యవస్థ కొన్ని సమస్యలు వచ్చి అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవుతాయి. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది.
ఎలా చెక్ చేయాలి..
బ్రేక్ ఆయిల్ ట్యాంక్ ను గుర్తించండి.. కారులో బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ అని ఓ చిన్న ట్యాంక్ ఉంటుంది. దానిని మొదటి గుర్తించాలి. సాధారణంగా అది మాస్టర్ సిలిండర్ కి దగ్గరలోనే ఉంటుంది. ఇది ఒక ప్లాస్టిక్ కంటైనర్. దానిలో ఆయిల్ లెవెల్ చూపించే లైన్స్ ఉంటాయి.
ఫ్లూయిడ్ లెవెల్ చెక్ చేయాలి.. బ్రేక్ ఫ్యూయల్ రిజర్వాయర్ గుర్తించాకా దానిలో గీతల ఆధారంగా ఆయిల్ లెవెల్ ను తనిఖీ చేయాలి. అది మినిమమ్, మాగ్జిమమ్ లెవెల్స్ ను చూపిస్తుంది. ఆ లెవెల్ మినిమమ్ కు వచ్చిందంటే తక్షణ ఆయిల్ ను మార్చుకోవాలి.
సరియైన ఆయిల్ ను ఎన్నుకోవాలి.. బ్రేక్ ఆయిల్ మినిమమ్ కు వస్తే తక్షణం దానిని పూర్తిగా ఖాళీ చేసి కొత్త ఆయిల్ మాగ్జిమమ్ లెవెల్ వరకూ వేయాలి. అయితే వేసే ఆయిల్ విషయంలో జాగ్రత్త వహించాలి. మీ కారు మాన్యువల్ ప్రకారం ఏది మంచిదో దానిని వినియోగించాలి.
లీకులు ఏమైనా ఉన్నాయా.. ఆయిల్ తో ట్యాంక్ ను నింపిన తర్వాత ఆ ట్యాంక్ కి ఏమైనా లీకేజీలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఏమైనా సమస్యలు గుర్తిస్తే వాటికి వెంటనే మరమ్మతులు చేసుకోవాలి.
రెగ్యూలర్ మెయింటెనెన్స్ అవసరం..
రెగ్యూలర్ గా బ్రేక్ ఆయిల్ లెవెల్స్ ను తనిఖీ చేయడం ద్వారా కారును బ్రేక్ ఫెయిల్యూర్స్ నుంచి తప్పించవచ్చు. అవకాశం ఉన్నంత వరకూ మంచి నిపుణుడైన మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లి అన్ని వ్యవస్థలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయించడం ద్వారా కారును ప్రమాదాల బారి నుంచి కాపాడుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి