AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: ఫిబ్రవరి 24తో నిలిచిపోనున్న ‘గూగుల్ ప్లే మ్యూజిక్’ సేవలు.. మరి యాప్‌లో ఉన్న డేటా పరిస్థితి ఏంటీ..?

Google Play Music Going To Shut Down: ఒకప్పుడు పాటలు వినాలంటే రేడియోలు, వాక్‌మెన్‌లు అందుబాటులో ఉండేవి కానీ మారుతోన్న కాలానికి అనుగుణంగా పాట వినే విధానంలోనూ మార్పులు వచ్చాయి. మొబైల్ ఫోన్లు వచ్చాక..

Google: ఫిబ్రవరి 24తో నిలిచిపోనున్న ‘గూగుల్ ప్లే మ్యూజిక్’ సేవలు.. మరి యాప్‌లో ఉన్న డేటా పరిస్థితి ఏంటీ..?
Narender Vaitla
|

Updated on: Feb 08, 2021 | 7:31 PM

Share

Google Play Music Going To Shut Down: ఒకప్పుడు పాటలు వినాలంటే రేడియోలు, వాక్‌మెన్‌లు అందుబాటులో ఉండేవి కానీ మారుతోన్న కాలానికి అనుగుణంగా పాట వినే విధానంలోనూ మార్పులు వచ్చాయి. మొబైల్ ఫోన్లు వచ్చాక పాటలను మెమొరీ కార్డుల్లో వేసుకొని వినేవారు. కానీ స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో మ్యూజిక్ కోసం కూడా ప్రత్యేకంగా యాప్‌లు వచ్చాయి. కేవలం ఇంటర్‌నెట్ ఆధారంగానే పాటలు వినే వెసులుబాటు కలిగింది. ఇలాంటి పాపులర్ మ్యూజిక్ యాప్‌లలో ‘గూగుల్ ప్లే మ్యూజిక్’ ఒకటి. కొన్ని వేల పాటలతో వినియోగదారులకు సరికొత్త మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అందించిన గూగుల్ మ్యూజిక్ సేవలు త్వరలోనే నిలిచిపోనున్నాయని గూగుల్ తెలిపింది. నిజానికి 2020 డిసెంబర్‌లోనే గూగుల్ మ్యూజిక్ యాప్‌ను నిలిపివేసినప్పటికీ.. ఈ యాప్‌లోని డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడం, ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటును మాత్రం ఫిబ్రవరి 24 వరకు పొడిగించింది. అనంతరం యాప్‌లో ఉన్న డేటా పూర్తిగా డిలీట్ కానుంది. ఈ క్రమంలోనే గూగుల్ మ్యూజిక్‌లోని డేటాను.. యూట్యూబ్ మ్యూజిక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని యూజర్లను కోరింది. ఈ విషయమై గూగుల్ వినియోగదారులకు ఈమెయిల్స్ పంపించింది. యూజర్లు… music.google.com లేదా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల ద్వారా తమ డేటాను యూట్యూబ్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. వీటిలో ప్లేలిస్ట్, పాటలు, ఆల్బమ్స్, లైక్స్, అప్‌లోడ్ చేసిన డేటాలాంటివి ఉంటాయి. నిజానికి గూగుల్ ప్లే మ్యూజిక్‌ నిలిపివేత ప్రక్రియను గతేడాది అక్టోబర్ నుంచే ప్రారంభించి, డిసెంబర్ నాటికి పూర్తిగా ఆపేశారు. అయితే గూగుల్ ఇలా చేయడానికి ప్రధాన కారణం.. తన యూజర్లను ‘యూట్యూబ్ మ్యూజిక్’ వైపు ఆకర్షించడానికే. ఇందులో భాగంగానే యూట్యూబ్ మ్యూజిక్‌లో పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

Also Read: Sandesh APP: కొత్త మెసేజింగ్ యాప్ తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం… వాట్సాప్‌కు పోటీగానేనా..?

Follow Us
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
ఉచిత విద్య, వసతి, భోజనం.. వేద విద్యపై ఆసక్తి ఉన్నవారికి గోల్డెన్
ఉచిత విద్య, వసతి, భోజనం.. వేద విద్యపై ఆసక్తి ఉన్నవారికి గోల్డెన్