Curtain Problem: ఏసీ కోచ్‌ల కర్టెన్లకు ఇక సెలవు.. ఎండ.. వేడిని కంట్రోల్ చేసే సరికొత్త విండోలను ఆవిష్కరించిన రైల్వే శాఖ

కోవిడ్ -19 మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు బయటపడుతున్నారు. ఇక కొంతమంది తమ మెదడుకు పదును పెట్టి అనేక సరికొత్తవాటిని సృష్టిస్తున్నారు. కరోనా సమయంలో ఏసీ కోచ్ లో తొలగించిన కర్టెన్స్ ప్లేస్ లో తాజాగా స్మార్ట్ స్విచ్చబుల్ విండో లను ప్రవేశ పెట్టింది...

Curtain Problem: ఏసీ కోచ్‌ల కర్టెన్లకు ఇక సెలవు.. ఎండ.. వేడిని కంట్రోల్ చేసే సరికొత్త విండోలను ఆవిష్కరించిన రైల్వే శాఖ
Follow us
Surya Kala

|

Updated on: Feb 08, 2021 | 8:12 PM

Curtain Problem: కోవిడ్ -19 మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు బయటపడుతున్నారు. ఇక కొంతమంది తమ మెదడుకు పదును పెట్టి అనేక సరికొత్తవాటిని సృష్టిస్తున్నారు. కరోనా సమయంలో ఏసీ కోచ్ లో తొలగించిన కర్టెన్స్ ప్లేస్ లో తాజాగా స్మార్ట్ స్విచ్చబుల్ విండో లను ప్రవేశ పెట్టింది రైల్వే శాఖ వివరాల్లోకి వెళ్తే..

కరోనా నేపథ్యంలో రైళ్ల ఎయిర్ కండిషన్డ్ బోగీల నుండి కర్టెన్లను తొలగించాలని రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాతీయ రవాణ శాఖ సరికొత్త ఐడియాతో రైళ్ల ఏసీ కోచ్ లోని విండోస్ ను మరింత సౌకర్యవంతంగా మార్చింది. విండోస్ నుంచి ఎండ వేడిని.. కాంతి ని కంట్రోల్ చేసే సరికొత్త స్మార్ట్ స్విచ్ కిటికీ ను ఆవిష్కరించింది. గత ఏడాది COVID-19 వ్యాప్తి చెందినప్పటి నుండి కరోనావైరస్ వ్యాప్తి నివారణకు రాజధాని, శాతాబ్ది, వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ఏసి కోచ్‌లలోని కర్టెన్లను తొలగించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.

కర్టెన్లను తొలగించడం తప్పని సరి కావడంతో వేసవికాలంలో రైల్ కోచ్ లోకి కిటికీల నుంచి వచ్చే కాంతి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించనుంది. ఎండ, వేడి తో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతారు. అది ఏసీ కోచ్ లో ఉన్న అంతర్గత శీతలీకరణ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు ఈ సమస్యకు భారతీయ రైల్వే మొదటిసారిగా పరిష్కారాన్ని రూపొందించిందని ఆ అధికారి తెలిపారు.

హౌరా-న్యూ ఢిల్లీలోని ఏసి స్పెషల్ కోచ్ లోని మొదటి శ్రేణి‌లో తూర్పు రైల్వే పిడిఎల్‌సి “స్మార్ట్ స్విచ్చబుల్ విండో” ను ప్రవేశపెట్టిందని ఆ అధికారి తెలిపారు. ఈ విండో గ్లాస్ పారదర్శకంగా ఉండి సాంకేతికత ఎండ వేడిని కంట్రోల్ చేయడానికి ఉపకరిస్తుందని చెప్పారు. ఈ విండో గ్లాస్ ప్రయాణీకులు కోరుకున్నప్పుడు అల్ట్రా వైలెట్ రేడియేషన్ను కూడా తగ్గిస్తుందన్నారు

Also Read:

తమిళనాట మళ్ళీ చిన్నమ్మ, త్వరలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన.

ఫాస్టాగ్ ఇంకా తీసుకోలేదా.? అయితే వెంటనే త్వరపడడండి.. ఫిబ్రవరి 15 నుంచి తప్పనిసరి.. ఎలా కొనుగోలు చేయాలంటే..?