AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: గూగుల్ పిచ్చెక్కించే ఆఫర్.. రూ.11కే 2000GB స్టోరేజ్.. పూర్తి వివరాలు ఇవే..

క్లౌడ్ స్టోరేజ్ కోసం మీరు నెలకు వందలు ఖర్చు పెడుతున్నారా.. అయితే ఆలస్యం చేయకండి.. ఈ దీపావళికి గూగుల్ ఊహించని బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఏకంగా 2TB భారీ స్టోరేజ్ ప్లాన్.. కేవలం రూపాయిలు 11కే మీ సొంతం.. అవును మీరు విన్నది నిజమే. గూగుల్ వన్ అందిస్తున్న ఈ బంపర్ ఆఫర్‌లో ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుందాం..

Google: గూగుల్ పిచ్చెక్కించే ఆఫర్.. రూ.11కే 2000GB స్టోరేజ్.. పూర్తి వివరాలు ఇవే..
Google One Subscription Deals
Krishna S
|

Updated on: Oct 16, 2025 | 4:58 PM

Share

మీరు క్లౌడ్ స్టోరేజ్ ఉపయోగిస్తున్నట్లయితే..ఈ దీపావళికి గూగుల్ మీ కోసం ఒక బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద, మీరు ఇప్పుడు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లలో 2TB స్టోరేజ్‌ను కూడా కేవలం 11కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌లో లైట్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం వంటి దాదాపు అన్ని ప్లాన్‌లను మూడు నెలల పాటు నెలకు రూ.11కే గూగుల్ అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు తమ డ్రైవ్, జీమెయిల్, ఫోటోలకు 2TB వరకు అదనపు క్లౌడ్ స్టోరేజ్‌ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది.

ఏ ప్లాన్‌లో ఎంత స్టోరేజ్..?

గూగుల్ వన్ యొక్క లైట్ ప్లాన్, సాధారణంగా నెలకు రూ.30 ఖర్చవుతుంది. ఇందులో 30GB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ప్లాన్ కూడా ఆఫర్‌లో భాగంగా మూడు నెలల పాటు నెలకు రూ.11కే అందుబాటులో ఉంది. అలాగే వరుసగా 100GB, 200GB నిల్వను అందించే బేసిక్, స్టాండర్డ్ ప్లాన్‌లను కూడా మూడు నెలల పాటు కేవలం రూ.11కే సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అత్యధిక స్టోరేజ్‌ను అందించే ప్రీమియం ప్లాన్ 2TB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది కూడా మూడు నెలల పాటు రూ.11కే కొనుగోలు చేయవచ్చు. ఈ బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్‌లలోని స్టోరేజ్ స్పేస్‌ను కుటుంబ సభ్యులతో లేదా ఇతరులతో కూడా పంచుకోవచ్చని గూగుల్ పేర్కొంది. మూడు నెలల ఆఫర్ గడువు ముగిసిన తర్వాత ప్లాన్ ధరలు సాధారణ స్థితికి తిరిగి వస్తాయి.

వార్షిక ప్లాన్‌లపై భారీ పొదుపు

నెలవారీ ఆఫర్‌తో పాటు గూగుల్ వార్షిక ప్లాన్‌లపై కూడా ప్రత్యేక దీపావళి డిస్కౌంట్‌లను అందించింది. వీటిపై వినియోగదారులు సాధారణ ధర కంటే 37శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. లైట్ ప్లాన్, వార్షిక ధర రూ.708 నుండి రూ.479కి తగ్గించింది. దీని ద్వారా రూ.229 ఆదా అవుతుంది. బేసిక్ (100GB), స్టాండర్డ్ (200GB) వార్షిక ప్లాన్‌లు కూడా తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. వాటి సాధారణ ధరలు వరుసగా రూ.1,560, రూ.2,520 కాగా, ఇప్పుడు వాటిని రూ.1,000, రూ.1,600 ధరకే పొందవచ్చు. ఇక ప్రీమియం ప్లాన్ (2TB) విషయానికి వస్తే దీని సాధారణ వార్షిక ధర రూ.10,700 తో పోలిస్తే.. ఆఫర్‌లో రూ7,800కి తగ్గింది. ఈ ప్లాన్‌లో యూజర్లు ఏకంగా రూ.2,900 వరకు పొదుపు చేసుకోవచ్చు. ఈ వార్షిక ప్లాన్ ఆఫర్ కూడా అక్టోబర్ 31 వరకు మాత్రమే చెల్లుతుంది. క్లౌడ్ స్టోరేజ్‌ను ఎక్కువగా ఉపయోగించే వారికి ముఖ్యంగా దీర్ఘకాలికంగా అవసరమైన వారికి ఈ ఆఫర్ ఒక గొప్ప అవకాశం.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..