Google Meet: గూగుల్‌ మీట్‌లో అదిరిపోయే సరికొత్త ఫీచర్‌.. ఇక నుంచి ఆ ఇబ్బంది ఉండదు

Google Meet: ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ప్లాట్‌ఫామ్‌ గూగుల్‌ మీట్‌లో సరి కొత్త ఫీచర్‌ను జోడించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ మీటింగ్స్‌, ఆన్‌లైన్ క్లాసుల కోసం ఎక్కువ‌గా గూగుల్ మీట్‌నే..

Google Meet: గూగుల్‌ మీట్‌లో అదిరిపోయే సరికొత్త ఫీచర్‌.. ఇక నుంచి ఆ ఇబ్బంది ఉండదు
Follow us

|

Updated on: Oct 23, 2021 | 1:24 PM

Google Meet: ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ప్లాట్‌ఫామ్‌ గూగుల్‌ మీట్‌లో సరి కొత్త ఫీచర్‌ను జోడించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ మీటింగ్స్‌, ఆన్‌లైన్ క్లాసుల కోసం ఎక్కువ‌గా గూగుల్ మీట్‌నే ఉపయోగిస్తున్నారు. రోజురోజుకూ యూజర్ల సంఖ్య పెరుగుతుండ‌టంతో గూగుల్ మీట్ సరికొత్త ఫీచ‌ర్లను జోడిస్తోంది. అయితే ఇదివ‌ర‌కు ఏదైనా మీటింగ్ ప్రారంభం అయ్యాక హోస్ట్‌కు మీటింగ్‌లో పాల్గొన్న వారి మైక్స్ ఆఫ్ చేసే ఆప్షన్‌ లేదు. కొంద‌రు మాట్లాడ‌టం పూర్తయ్యాక‌.. త‌మ మైక్‌ను ఆఫ్ చేయ‌క‌పోయినా.. మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది. కానీ ఇక నుంచి అలాంటి ఇబ్బందులేమి ఉండవు. మీటింగ్‌లో ఉన్న అంద‌రు పార్టిసిపెంట్స్‌ను ఒకేసారి మ్యూట్ చేసే ఆప్షన్ హోస్ట్‌కు ఉంటుంది. వారు మాట్లాడాల‌ని అనుకున్నప్పుడు హోస్ట్ మ్యూట్ ఆప్షన్‌ను తీసేయ‌వ‌చ్చు.

ఈ ఫీచ‌ర్‌ను గూగుల్ వ‌ర్క్‌స్పేస్ ఫ‌ర్ ఎడ్యుకేష‌న్ ఫండ‌మెంట‌ల్స్ అండ్ ఎడ్యుకేష‌న్ ప్లస్ డొమైన్స్‌లో తీసుకురానున్నారు. గూగుల్ వ‌ర్క్‌స్పేస్ ఎడిష‌న్స్‌లో త్వర‌లోనే ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. మ్యూట్ ఆల్ అనే ఫీచ‌ర్ కేవ‌లం మీటింగ్ హోస్ట్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒక‌సారి గ్రూప్‌ మీటింగ్‌లో పాల్గొన్న వారు మ్యూట్ చేశాక‌.. మ‌ళ్లీ వాళ్లను అన్‌మ్యూట్ చేయ‌డం కుద‌ర‌దు. ఒక‌వేళ పాల్గొన్న వారు కావాల‌నుకుంటే అన్‌మ్యూట్ చేసుకోవ‌చ్చు. డెస్క్‌టాప్ బ్రౌజ‌ర్ నుంచి గూగుల్ మీట్‌ను యాక్సెస్ చేసుకున్న హోస్ట్‌కు మాత్రమే మ్యూట్ ఆల్ ఫీచ‌ర్ అందుబాటులో ఉంటుంది. త్వరలోఏన అన్ని ప్లాట్‌ఫామ్‌ల‌లో ఈ ఫీచ‌ర్‌ను అందబాటులోకి తీసుకువస్తామని గూగుల్ త‌న బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. అయితే యూజ‌ర్లు మ్యూట్ చేయాల‌నుకుంటే యూజ‌ర్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మ్యూట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచ‌ర్ హోస్ట్‌ల‌కు డీఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటుందని గూగుల్‌ చెబుతోంది. గూగుల్ ఇటీవ‌లే గూగుల్ మీట్‌లో లైవ్ స్పీచ్‌ను ట్రాన్స్‌లేటెడ్ క్యాప్షన్స్‌గా మార్చే ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. దాని త‌ర్వాత తాజాగా మ్యూట్ ఆల్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

ఇవీ కూడా చదవండి:

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్‌ చేస్తే.. చేతికి16 లక్షలు.. పూర్తి వివరాలు..!

Train Ticket Cancellation: రైలు టికెట్ రద్దు చేసుకుంటున్నారా..? డబ్బులు ఆదా చేయడానికి ఈ విషయాలు తెలుసుకోండి..!

Income Tax Alert: 12 గంటల పాటు నిలిచిపోనున్న ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌.. కారణం ఏంటంటే..!

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!