Google Maps: ఇకపై స్పీడ్ చలాన్‌లను తప్పించుకోవచ్చు.. గూగుల్ మ్యాప్స్‌లో సూపర్ ఫీచర్..
రోడ్లపై ఎవరికీ తెలియని చోట ఇలాంటి స్పీడ్ గన్స్‌తో వాహనాల వేగాన్ని లెక్కిస్తుంటారు. సదరు రోడ్డుపై పేర్కొన్న వేగ పరిమితికి మించి వాహనాన్ని డ్రైవ్ చేస్తే ఆటోమెటిక్‌గా చలాన్‌ను పంపించేలా వ్యవస్థను రూపొందించార. దీంతో రోడ్లపై వాహన వేగం పరిమితి ఎంత తెలియక చాలా మంది అనవసరంగా చలాన్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ప్రయణిస్తున్న మార్గంలో వేగ పరిమితుల్ని గుర్తిస్తూ అలర్ట్ చేసే విధానం అందుబాటులో..
వాహనాలను మితిమీరి వేగంతో నడిపితే ప్రమాదాలు జరుగుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయం తెలిసినా కొందరు అతివేగంతో దూసుకుపోతుంటారు. తమ ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలను సైతం రిస్క్‌లో పెడుతుంటారు. అయితే ఇలా ఓవర్ స్పీడ్‌కు చెక్ పెట్టేందుకే అధికారులు స్పీడ్ గన్స్‌ను ఏర్పాటు చేస్తుంటారు.
రోడ్లపై ఎవరికీ తెలియని చోట ఇలాంటి స్పీడ్ గన్స్‌తో వాహనాల వేగాన్ని లెక్కిస్తుంటారు. సదరు రోడ్డుపై పేర్కొన్న వేగ పరిమితికి మించి వాహనాన్ని డ్రైవ్ చేస్తే ఆటోమెటిక్‌గా చలాన్‌ను పంపించేలా వ్యవస్థను రూపొందించార. దీంతో రోడ్లపై వాహన వేగం పరిమితి ఎంత తెలియక చాలా మంది అనవసరంగా చలాన్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ప్రయణిస్తున్న మార్గంలో వేగ పరిమితుల్ని గుర్తిస్తూ అలర్ట్ చేసే విధానం అందుబాటులో ఉంటే భలే ఉంటుంది కదూ.!
అచ్చంగా ఇలాంటి ఆలోచనే చేసింది గూగుల్. ఇందులో భాగంగానే తన గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. రియల్ టైమ్ స్పీడ్ లిమిట్ సమాచారాన్ని డ్రైవర్‌కు తెలిపేలా ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో పరిమితికి మించి వేగంతో ప్రయాణిస్తే వెంటనే డ్రైవర్‌కు అలర్ట్ వస్తుంది. స్ట్రీట్ వ్యూ ఫొటోలు, థర్డ్ పార్టీ ఫొటోల సహాయంతో గూగుల్ స్పీడ్ లిమిట్‌ను గుర్తించి వెంటనే అలర్ట్ చేస్తుంది.
ఇక గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే.. ఇందుకోసం ముందుగా మీ మొబైల్‌లోని గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం కుడివైపు కనిపించే ప్రొఫైల్ ఐకాన్‌ని ట్యాప్ చేసిన సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం స్క్రిన్‌ని కిందికి స్క్రోల్ చేసిన ‘నావిగేషన్ సెట్టింగ్స్’లోకి వెళ్లాలి. అనంతరం అందులో ‘డ్రైవింగ్ ఆప్ష్స్’ సెక్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. వీటిలో ‘స్పీడోమీటర్’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో మీరెంత వేగంతో ప్రయాణిస్తున్నారో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. అలాగే లిమిట్‌కు మించిన వేగంతో వాహనం నడిపిస్తే వెంటనే మీకు అలర్ట్ వెళ్తుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను త్వరలోనే ఐఓఎస్ ఫోన్‌లలోనూ తీసుకురానున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..