Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Technology: చలనంలేని చిత్రాలకు జీవంపోస్తున్న యాప్.. సినిమాలను మైమరిపించే విజువల్ ఎఫెక్ట్స్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ మాట ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట మంత్ర జపంలా వినిపిస్తోంది. ఏ రంగాన్ని ఎంచుకున్నా ఏఐ సాంకేతికతను వినియోగించుకోకుండా పని చేయడంలేదు. గతంలో ఈ సాంకేతికత ఉన్నప్పటికీ 2022 తరువాత కాలంలో విపరీతంగా ప్రచుర్యంలోకి వచ్చింది.

AI Technology: చలనంలేని చిత్రాలకు జీవంపోస్తున్న యాప్.. సినిమాలను మైమరిపించే విజువల్ ఎఫెక్ట్స్
Reddit Post Is An App Uses Ai Technology, To Bring Photos To Life And Create Videos
Follow us
Srikar T

|

Updated on: Dec 02, 2023 | 12:10 PM

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ మాట ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట మంత్ర జపంలా వినిపిస్తోంది. ఏ రంగాన్ని ఎంచుకున్నా ఏఐ సాంకేతికతను వినియోగించుకోకుండా పని చేయడంలేదు. గతంలో ఈ సాంకేతికత ఉన్నప్పటికీ 2022 తరువాత కాలంలో విపరీతంగా ప్రచుర్యంలోకి వచ్చింది. దీనిని ముఖ్యంగా కళ, సంగీత, సాహిత్య, డిజైనింగ్, ఫిల్మ్ మేకింగ్, సాఫ్ట్ వేర్, ఎడ్యూకేషన్, పెయింటింగ్, రైటింగ్ వంటి రంగాల్లో ఉపయోగించి అద్భుతాలు సృష్టిస్తున్నారు.

ఇది సాంకేతికతను అందిపుచ్చుకోవడం, అవసరానికి వాడుకోవడం వరకూ ఉంటే బాగుంటుంది. అదే ఒకరి ఉపాధిని దెబ్బతీసేదిగా ఉంటే రానున్న రోజుల్లో తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని చెబుతున్నారు నిపుణులు. తాజాగా రెడ్డిట్ పోస్ట్ అనే యాప్ ద్వారా సాధారణమైన ఫోటోలకు జీవాన్ని తీసుకురావచ్చు అని నిరూపించింది. దీనికి ఏఐ టెక్నాలజీని వినియోగించుకుంది. మనకు కనిపించే వీడియోలో చలనం లేని పక్షిని జీవం పోస్తూ, నిలబడి ఉన్న కారును వేగంగా కదిలేలా చేస్తూ, ఎండిపోయిన ఆకులకు ప్రాణం పోస్తూ కదిలేలా చేసింది.

దీనిని చూసిన నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది అద్భతమైన టెక్నాలజీ అని ప్రశంశిస్తుంటే మరి కొందరు తప్పుపడుతున్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అనే మాటను చెబుతున్నారు. అంటే ప్రతి విషయంలోనూ అతిగా వ్యవహరించకూడదు అని అర్ధం. ఇది ఏఐ టెక్నాలజీకి కూడా వర్తిస్తుంది అంటున్నారు. అలాగే ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌ సర్చ్ ఇంజన్‌ను ఆశ్రయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గూగుల్ గురువుకు ప్రత్యమ్నాయం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోలేక పోతున్నారు. గూగుల్‌లో ఏదైనా విషయాన్ని పొందు పరచాలంటే కూడా గురవే దానికి మూలం అనే చిన్న విషయాన్ని అవగతం చేసుకోలేకపోతున్నారు నేటి తరం వారు. ఇలాంటి అద్భుతమైన సాంకేతికతను మితంగా వాడుకొని దానికి మన క్రియేటివిటీని జోడిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. అంతేగానీ తరచూ దానిమీదే ఆధారపడితే భవిష్యత్తు సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో