Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: యూజర్ల భద్రత కోసం వాట్సాప్‌ మరో ముందడుగు.. సీక్రెట్ కోడ్‌ పేరుతో..

ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను జారిపోకుండా చూసుకుంటోంది. మరీ ముఖ్యంగా యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వాట్సాప్‌ సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. సీక్రెట్‌ కోడ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో యూజర్లకు మరింత భద్రత కల్పించనుంది. ఇంతకీ ఈ ఫీచర్‌ ఉపయోగం ఏంటి.?

WhatsApp: యూజర్ల భద్రత కోసం వాట్సాప్‌ మరో ముందడుగు.. సీక్రెట్ కోడ్‌ పేరుతో..
Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 01, 2023 | 5:27 PM

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్స్‌లో ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ ఒకటి. మార్కెట్లో ఎన్ని రకాల మెసేజింగ్‌ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌ క్రేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణం వాట్సాప్‌ తీసుకొస్తున్న ఫీచర్స్‌.

ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను జారిపోకుండా చూసుకుంటోంది. మరీ ముఖ్యంగా యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వాట్సాప్‌ సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. సీక్రెట్‌ కోడ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో యూజర్లకు మరింత భద్రత కల్పించనుంది. ఇంతకీ ఈ ఫీచర్‌ ఉపయోగం ఏంటి.? దీనిని ఎలా యాక్టివేట్ చేసుకోవాల ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం వాట్సాప్‌ యూజర్లు తమ వ్యక్తిగత చాట్స్‌ను లాక్‌ చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కొన్ని లోటుపాట్లు ఉండడంతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్లకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యంగా వాట్సాప్‌ న్యూ సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త సీక్రెట్‌ కోడ్ ఫీచర్‌తో యూజర్లు తమ చాట్స్‌కు వ‌ర్డ్స్‌, ఎమోజీల‌తో యూనిక్ పాస్‌వ‌ర్డ్ క్రియేట్ చేసుకోవ‌చ్చు. ఈ కొత్త ఫీచర్‌తో సెర్చ్‌ బార్‌లో కేవలం సీక్రెట్ కోడ్‌ను టైప్‌ చేస్తే చాలు.. లాక్డ్ చాట్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

దీంతో మీ వ్యక్తిగత చాట్‌ బాక్స్‌లు మరెవరికీ కనిపించకుండా ఉంటాయి. కేవలం సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసిన సమయంలోనే చాట్ ఓపెన్‌ అయ్యేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌తో యూజర్లు యూనిక్‌ పాస్‌వ‌ర్డ్‌తో వారి చాట్స్‌ను ప్రొటెక్ట్ చేసుకోవ‌చ్చ‌ని మెటా సీఈవో తెలిపారు. కేవలం సెర్చ్‌ బార్‌లో సీక్రెట్ కోడ్ ఎంటర్‌ చేస్తేనే లాక్ట్‌ చాట్స్‌ కనిపిస్తాయి. చాట్ సంభాషణను సురక్షితంగా ఉండాలని కోరుకునే వారికి ఈ ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని వాట్సాప్‌ చెబుతోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..