Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్‌లో మెసేజ్‌ షెడ్యూల్ ఎలాగో తెలుసా.? ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

అయితే వాట్సాప్‌ అధికారికంగా ఇలాంటి ఫీచర్‌ను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే థార్డ్‌ పార్టీ యాప్‌ ద్వారా మీరు పంపాలనుకున్న మెసేజ్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు అనుకున్న సమయానికి మీరు పంపాలనుకున్న వ్యక్తికి నేరుగా మెసేజ్‌ వెళ్లిపోతుంది. ఇంతకీ వాట్సాప్‌లో ఇలా మెసేజ్‌ షెడ్యూల్‌ చేసుకోవాలంటే ఏం చేయాలి.?

Whatsapp: వాట్సాప్‌లో మెసేజ్‌ షెడ్యూల్ ఎలాగో తెలుసా.? ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..
Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 01, 2023 | 12:01 AM

ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగం అనివార్యంగా మారింది. స్మార్ట్ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సాప్‌ ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌. ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్‌ సైతం ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే మనం ఎవరికైనా మెసేజ్‌ను పంపాలనుకొని మర్చిపోతుంటాం. అదే మీరు పంపాలనుకునే మెసేజ్‌ను షెడ్యూల్ చేసి పెట్టే ఆప్షన్‌ ఉంటే బాగుంటుంది కదూ.

అయితే వాట్సాప్‌ అధికారికంగా ఇలాంటి ఫీచర్‌ను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే థార్డ్‌ పార్టీ యాప్‌ ద్వారా మీరు పంపాలనుకున్న మెసేజ్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు అనుకున్న సమయానికి మీరు పంపాలనుకున్న వ్యక్తికి నేరుగా మెసేజ్‌ వెళ్లిపోతుంది. ఇంతకీ వాట్సాప్‌లో ఇలా మెసేజ్‌ షెడ్యూల్‌ చేసుకోవాలంటే ఏం చేయాలి.? ఎలాంటి స్టెప్స్‌ ఫాలో అవ్వాలి.? ఇందుకోసం ఏ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్‌లో ఆటోమేటిక్‌గా మెసేజ్‌లను పంపించడానికి పలు రకాల థర్డ్‌ పార్టీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్కెడిట్ అనే థార్డ్ పార్ట్‌ యాప్ ఒకటి. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలో స్టెప్‌ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం..

* ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి SKEDit యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

* అనంతరం మీ ఫేస్‌బుక్‌ ఖాతాతో సైన్ఇన్‌ చేయాలి.

* అనంతరం మీ పేరు, ఇమెయిల్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి.

* తర్వాత ఇమెయిల్‌కి వెరిఫికేషన్‌ ఇమెయిల్‌ వస్తుంది.

* ఇమెయిల్‌ను వెరిఫై చేసుకున్న తర్వాత వాట్సాప్‌పై క్లిక్‌ చేసి స్కెడిట్ యాప్‌కు అవసరైన అనుమతులను మంజూరు చేయాలి.

* అనంతరం మీరు మెసేజ్‌ చేయాలనుకుంటున్న సమయాన్ని ఎంచుకొని షెడ్యూల్‌ చేస్తే సమయానికి మెసేజ్‌ వెళ్లిపోతుంది.

* ఇక మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను పంపే ముందు మీ అనుమతి ఇవ్వాలనుకుంటే ఆ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇలా చేస్తే.. షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను పంపినప్పుడు.. ముందుగా మీ పర్మిషన్‌ అడుగుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..