Google Play Store: మీ ఫోన్‌లో బ్యాటరీ, డేటా త్వరగా అయిపోతోందా.? అయితే ఈ యాప్‌లను వెంటన్ డిలీట్ చేయండి..
స్మార్ట్ ఫోన్ పనితీరు ఫోన్‌లో ఉండే యాప్‌లపై ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాటరీ పనితీరు, డేటా వినియోగం యాప్‌లపై ఆధార పడి ఉంటుంది. కొన్ని రకాల యాప్స్ డేటాను ఎక్కువగా వినియోగించుకుంటాయి...

స్మార్ట్ ఫోన్ పనితీరు ఫోన్‌లో ఉండే యాప్‌లపై ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాటరీ పనితీరు, డేటా వినియోగం యాప్‌లపై ఆధార పడి ఉంటుంది. కొన్ని రకాల యాప్స్ డేటాను ఎక్కువగా వినియోగించుకుంటాయి. అయితే కొన్ని రకాల యాప్స్ మాత్రం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం యూజర్ల ఫోన్‌లను ఉపయోగిస్తున్నాయని గూగుల్ ప్రకటించింది. ఇందులో భాగంగానే ఫోన్ బ్యాటరీ, డేటాను త్వరగా ఖాళీ చేస్తున్న 16 యాప్‌లను ప్లేస్టోర్‌ల నుంచి తొలగించారు. యూజర్లు కూడా వెంటనే యాప్‌లను డివైజ్‌లను డిలీట్ చేసుకోమని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ యాప్‌లు ఏంటి.? సదరు యాప్‌లతో బ్యాటరీ ఎందుకు త్వరగా ఖాళీ అవుతోందో తెలుసుకుందాం..
గూగుల్ తెలిపిన ఈ 16 యాప్‌లు యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే హెచ్‌టీటీపీ రిక్వెస్ట్ సాయంతో ఒక రిమోట్ కాన్ఫిగరేషన్‌ను డౌన్‌లోడ్ చేస్తాయి. ఆ తర్వాత క్లౌడ్ మెసేజింగ్ ద్వారా డెవలపర్‌కు పుష్ మెసేజెస్ పంపుతాయి. వీటి సహాయంతో డెవలపర్ యూజర్‌కు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో పలు వెబ్‌సైట్లు ఓపెన్ చేసి ఎంచుకున్న యాడ్స్‌పై క్లిక్ చేస్తుంటాయి. ఇదంతా యూజర్లకు తెలియకుండానే జరుగుతుంది. దీంతో ఫోన్ బ్యాటరీ, డేటా వినియోగం పెరుగుతుందని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే తెలిపింది. అంతేకాకుండా ఈ యాప్‌ల ద్వారా కొన్ని సందర్భాల్లో మాల్‌వేర్‌లను స్మార్ట్‌ఫోన్‌లలోకి ప్రవేశపెట్టి పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంకింగ్ వివరాలను దొంగలించే అవకాశం ఉంది తెలిపింది. కాబట్టి ఈ యాప్‌లను వెంటనే తొలగించుకోమని సూచించింది.
ఇంతకీ ఆ యాప్స్ ఏంటంటే..
బుసాన్‌బస్, జాయ్‌కోడ్, కరెన్సీ కన్వర్టర్, హైస్పీడ్ కెమెరా, స్మార్ట్ టాస్క్ మెనేజర్, ఫ్లాష్‌లైట్+, కే-డిక్షనరీ, క్విక్ నోట్, ఈజెడ్‌డికా, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్‌లోడర్, ఈజెడ్ నోట్స్, మెమోక్యాలెండర్, ఫ్లాష్‌లైట్, క్యాల్‌కల్ వంటి యాప్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..