AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఆటోమేషన్‌ టూల్‌తో క్షణాల్లో తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌..

అధిక రద్దీ కారణంగా టిక్కెట్లు బుక్‌ చేసుకోవడంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి, మెరుగైన సేవలను అందించడానికి భారతీయ రైల్వేలు ప్రయాణికులు సులభంగా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి కొత్త ఫీచర్‌ను అందిస్తుంది. ఐఆర్‌సీటీసీ తత్కాల్ ఆటోమేషన్ టూల్‌తో భారతీయ రైల్వే ప్రయాణీకులను బయలుదేరే షెడ్యూల్ తేదీకి ఒక రోజు ముందుగా టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.

IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఆటోమేషన్‌ టూల్‌తో క్షణాల్లో తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌..
IRCTC
Nikhil
|

Updated on: Sep 24, 2023 | 6:30 PM

Share

భారతదేశంలో ప్రయాణానికి ఎక్కువ శాతం మంది ప్రజలు రైల్వేలనే వాడుతారు. తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణమంటే కచ్చితంగా భారతీయ రైల్వేలు ప్రథమ స్థానంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో పండుగల సీజన్‌లో చాలా మంది తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ముందుగానే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా టిక్కెట్లను బుక్‌ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడిదాకా బాగానే ఉన్నా అత్యవసరంగా ప్రయాణించాల్సి వస్తే కచ్చితంగా తత్కాల్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే అధిక రద్దీ కారణంగా టిక్కెట్లు బుక్‌ చేసుకోవడంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి, మెరుగైన సేవలను అందించడానికి భారతీయ రైల్వేలు ప్రయాణికులు సులభంగా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి కొత్త ఫీచర్‌ను అందిస్తుంది. ఐఆర్‌సీటీసీ తత్కాల్ ఆటోమేషన్ టూల్‌తో భారతీయ రైల్వే ప్రయాణీకులను బయలుదేరే షెడ్యూల్ తేదీకి ఒక రోజు ముందుగా టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ మొదట వచ్చిన వారికి ముందుగా అందించబడుతుంది కాబట్టి ప్రయాణికులు వేగంగా ఉండటం చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఐఆర్‌సీటీసీ తత్కాల్ ఆటోమేషన్

ఐఆర్‌సీటీసీ తత్కాల్ ఆటోమేషన్ టూల్ అనేది బుకింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి రూపొందించబడిన ఉచిత ఆన్‌లైన్ సాధనం. ఈ కొత్త టూల్‌ పేర్లు, వయస్సు, ప్రయాణ తేదీలు వంటి ప్రయాణీకుల వివరాలను త్వరగా లోడ్ చేయడం ద్వారా టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. తత్కాల్ టిక్కెట్‌లను మరింత సమర్థవంతంగా భద్రపరచడంలో మీకు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

తత్కాల్‌ ఆటోమేషన్‌ టూల్‌తో టిక్కెట్‌ బుకింగ్‌ ఇలా

  • ముందుగా మీరు మీ క్రోమ్‌ బ్రౌజర్‌లో ఐఆర్‌సీటీసీ తత్కాల్ ఆటోమేషన్ టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • అనంతరం మీరు ఐఆర్‌సీటీసీ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
  • ముందుగా ప్రయాణికుల వివరాలు, ప్రయాణ తేదీలు, చెల్లింపు ప్రాధాన్యతలను సేవ్ చేయడానికి సాధనాన్ని ఉపయోగించాలి.
  • అసలు బుకింగ్ ప్రక్రియలో “డేటాను లోడ్ చేయి”పై క్లిక్ చేయాలి.
  • తర్వాత మీ ప్రయాణీకుల సమాచారం సెకన్లలో లోడ్ అవుతుంది.
  • అనంతరం మీరు తక్షణ చెల్లింపు చేయడానికి కొనసాగండి, మీ తత్కాల్ టిక్కెట్ అప్రయత్నంగా బుక్ అవుతుంది.
  • అయితే ఈ కొత్త టూల్‌ ద్వారా స్లో ఇంటర్నెట్, చివరి నిమిషంలో వివరాల ఒత్తిడి లేకుండా ధ్రువీకరించబడిన తత్కాల్ టిక్కెట్‌ను పొందే అవకాశాలను పెంచుకోవచ్చు.