- Telugu News Photo Gallery Technology photos Best smartphone under 10k, Have a look on features and price details Telugu tech News
smartphone under 10k: రూ. 10వేలలో స్మార్ట్ ఫోన్స్ కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్ ఇదే..
మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ సందడి చేస్తున్నాయి. రకరకాల ఫీచర్స్‌తో కూడిన ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. కంపెనీల మధ్య ఉన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మార్కెట్లో రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్‌లు, ఫీచర్లు ఎలా ఉన్నాయు.? ఓ లుక్కేయండి..
Updated on: Sep 24, 2023 | 3:00 PM

ఇన్ఫినిక్స్ HOT 30i: రూ. 10 వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ స్మార్ట్ ఫోన్ ఒకటి ఈ ఫోన్‌లో 6.66 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. మీడియా టెక్ హీలియో జీ37 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 7999గా ఉంది.

రెడ్‌మీ 9 : రెడ్‌మీ 9 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,499గా ఉంది. ఈ ఫోన్‌లో 6.53 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చార. ఇందులో 13 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాను ఇచచారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

రియల్‌మీ సీ33: ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.2 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర రూ. 8,936గా ఉంది.

రియల్‌మీ నార్జో N53 : రియల్ మీ నార్జో ఎన్53 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999గా ఉంది. ఈ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించార. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను ఇచ్చారు.

పోకో సీ55: ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,433గా ఉంది. ఈ ఫోన్‌లో 6.71 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ ఫోన్‌లో 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా ఈ ఫోన్ సొంతం.





























