Gizmore Smart watch: కేవలం రూ. 1,199కే సకల హంగులతో స్మార్ట్ వాచ్.. హెల్త్ ట్రాకర్, బ్లూ టూత్ కాలింగ్ ఇంకా ఎన్నో..
అత్యంత చవకైన స్మార్ట్ వాచ్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అధునాతక ఫీచర్లతో ఆకర్షిస్తోంది. అసలు వాచ్ ఏంటి? దానిలోని ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం అంత స్మార్ట్ వాచ్‌ల ట్రెండ్ నడుస్తోంది. అందరూ మణికట్టుకు అధునాతన సాంకేతికతో కూడిన వాచ్‌లను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో వివిధ కంపెనీలు రకరకాల మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అయితే వాటి ధర మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ఇక బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ కావాలంటే వేలకు వేలు పోయాల్సిందే. ఈ నేపథ్యంలో అత్యంత చవకైన స్మార్ట్ వాచ్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అంతేకాక అధునాతక ఫీచర్లతో ఆకర్షిస్తోంది. అసలు వాచ్ ఏంటి? దానిలోని ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
గిజ్ మోర్ క్లౌడ్..
గిజ్ మోర్ కంపెనీ అత్యంత చవకైన గిజ్ మోర్ క్లౌడ్ అనే మోడల్ స్మార్ట్ వాచ్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ లోని ఫీచర్లు, దాని స్పెషల్ ప్రైస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 1.85 ఇంచెస్ డిస్ ప్లే, రొటేటింగ్ క్రౌన్ కంట్రోల్, 500 నిట్స్ బ్రైట్ నెస్ మాత్రమే కాకుండా.. ఈ వాచ్ లో బ్లూటూత్ కాలింక్ సదుపాయం కూడా ఉంది. దీంతో స్మార్ట్ వాచ్ ద్వారానే కాల్ చేయడం, కాల్ రిసీవ్ చేసుకోవడం చేయచ్చు. మ్యూజిక్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ వాచ్ తో మీరు అలెక్సా, సిరి, గూగుల్ కూడా సపోర్ట్ చేస్తుంది. కేలరీ మోనిటర్, స్లీప్ మోనిటర్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటర్, మహిళల కోసం పిరియడ్స్ కాలిక్యూలేటర్ వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ వాచ్ బ్యాటరీ చాలా పెద్దదనే చెప్పాలి. బ్లూటూత్ కాలింగ్ ద్వారా అయితే రెండ్రోజులు, బ్లూటూత్ కాలింగ్ వాడకపోతే వారంపాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్ తో ఈ వాచ్ వస్తోంది.
ధర ఎంతంటే..
దీని ధర విషయానికి వస్తే లాంఛింగ్ ఆఫర్ కింద కేవలం రూ.1,199కే అందిస్తున్నారు. ఆ తర్వాత దీనిని రూ. 1,699 కి విక్రయిస్తారు. అయితే ఇది పరిమిత కాల ఆఫర్ గా చెబుతున్నారు. అంతేకాకుండా ఫ్లిప్ కార్ట్ లో అయితే ఈ వాచ్ పై బ్యాంక్ ఆఫర్స్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఎన్నో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆక్సిస్ బ్యాంక్ కార్డు ఉంటే వారు ఈ స్మార్ట్ వాచ్ పై అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ వాచ్ ఫీచర్స్ విషయంలో మార్కెట్ లో దొరికే బడా స్మార్ట్ వాచ్ లతోనే పోటీ పడుతోంది. ఇది బ్లాక్ స్ట్రాప్, బ్లూ స్ట్రాప్, బ్లాక్ మెటల్ బాడీ, బ్రౌన్ కలర్ స్ట్రాప్, రోస్ గోల్డ్ మెటల్ బాడీ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..