Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. ఎలాంటి ప్రమాదం ఉంటుంది..?

Asteroid:ఆకాశం నుంచి మరో భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకురానుంది. అయితే గ్రహశకలాలు భూమికి దగ్గరగా ప్రయాణిస్తూ ఉంటాయి...

Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. ఎలాంటి ప్రమాదం ఉంటుంది..?
Follow us

|

Updated on: Jan 18, 2022 | 1:03 PM

Asteroid:ఆకాశం నుంచి మరో భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకురానుంది. అయితే గ్రహశకలాలు భూమికి దగ్గరగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ గ్రహశకలం జనవరి 18వ తేదీన భూమిని ఢీకొనే అవకాశం ఉందని నాసా (NASA)శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. 7482గా పిలుస్తున్న ఈ భారీ గ్రహశకలం దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతోందని, భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం భూమి నుంచి 1.93 మిలియన్ కిమీ దూరంలో ఉంది.

సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడిన సమయంలో మిగిలిపోయిన ఆస్టరాయిడ్​ గా చెప్పుకొనే ఈ భారీ గ్రహశకం గురించి శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. ఈ గ్రహశకలం గంటకు 70,416 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ భూమివైపు దూసుకొస్తుంది. భూమి- చంద్రుడి మధ్య దూరం కన్నా 5.15 రెట్లు అధికమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది సుమారు 1 కిలోమీటర్ భారీ వ్యాసార్థం కలిగి ఉంది.

భూమిపై దూసుకొస్తున్న ఈ భారీ గ్రహశకలం ఎఫెక్ట్‌ పెద్దగా ఉండనప్పటికీ.. అయితే ఈ తరహా గ్రహశకలాలు ప్రతి ఆరు లక్షల సంవత్సరాలకు ఒకసారి భూ గ్రహాన్ని ఢీకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వచ్చే 200 ఏళ్లలో మనకు అత్యంత సమీపంలోని గ్రహశకలం 7482ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం పై ట్రాక్‌ చేస్తోంది. భూమికి సమీపంలో ఉన్న 26000 ఆస్టరాయిడ్‌లను ట్రాక్‌ చేస్తోంది.

అయితే ఈ గ్రహశకలం వేగం సెకనుకు 12 మైళ్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రహశకలం భూమిని నాశనం చేసే సామర్థ్యం ఉంటుందని, నిజానికి ఈ గ్రహశకలాన్ని పరిశీలిస్తే పెద్దగా ప్రమాదం లేనట్లు శస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి వైపు అతివేగంగా దూసుకువస్తున్న గ్రహశకలం గురించి నాసా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం సంభవించకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Phone Storage: మీ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజీ నిండిపోయిందా..? ఇలా చేయండి..!

White Label ATM: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. రానున్న రోజుల్లో 20 వేలకుపైగా కొత్త ఏటీఎంల ఏర్పాటు..!