Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఊహకందని ఆఫర్స్‌.. స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బచాత్‌ డేస్‌ సేల్‌ పేరుతో మంచి సేల్‌ను అందిస్తోంది. జూల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సేల్‌ 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌ భాగంగా స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు. అన్ని రకాల స్మార్ట్ ఫోన్‌ల ధరలను తగ్గించారు. అలాగే తక్కువ మొత్తంలో నెలవారీ చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను అందించారు...

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఊహకందని ఆఫర్స్‌.. స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌
Flipkart Sale
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 02, 2024 | 3:27 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బచాత్‌ డేస్‌ సేల్‌ పేరుతో మంచి సేల్‌ను అందిస్తోంది. జూల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సేల్‌ 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌ భాగంగా స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు. అన్ని రకాల స్మార్ట్ ఫోన్‌ల ధరలను తగ్గించారు. అలాగే తక్కువ మొత్తంలో నెలవారీ చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను అందించారు. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా ఏయే స్మార్ట్‌ ఫోన్స్‌పై డిస్కౌంట్స్‌ లభించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా వివో టీ3ఎక్స్‌ ఫోన్‌పై డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఈ 5జీ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 13,499కాగా, ఆఫర్‌లో భాగంగా రూ. 1000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. దీంతో పాటు నెలకు కేవలం రూ. 836 ఈఎమ్‌ఐ చెల్లింపుతో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

* మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ ఫోన్‌పై భారీ ఆఫర్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 2000 డిస్కౌంట్‌ పొందొచ్చు. అలాగే నో కాస్ట్‌ ఈఎమ్‌ఐని సైతం అందిస్తున్నారు. ఇక ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం కూడా ఇందులో 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

* షావోమీ 14 సివి స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 42,999కాగా హెచ్‌డీఎఫ్‌ బ్యాంకుకు చెందిన క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 3000 డిస్కౌంట్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను కూడా అందించారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.55 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎస్‌ జెన్‌ 3 ప్రాసెసర్‌ను అందించారు. 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 50 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..