Samsung Galaxy F54: సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే..

సౌత్‌ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ప్రీమియం సెగ్మెంట్‌తో పాటు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది సామ్‌సంగ్‌. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌54 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు...

Samsung Galaxy F54: సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే..
Samsung Galaxy F54
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 02, 2024 | 4:48 PM

సౌత్‌ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ప్రీమియం సెగ్మెంట్‌తో పాటు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది సామ్‌సంగ్‌. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌54 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్‌54 స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ ప్లస్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ ఎక్సినోస్‌ 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ స్కానర్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇక ఈ సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌54లో బ్యాటరీకి పెద్ద పీట వేశారు. ఇందులో ఏకంగా 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వడం విశేషం. ఈ ఫోన్‌ కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇక ఫోన్‌ను ఎంత నాన్‌ స్టాప్‌గా ఉపయోగించినా 8 గంటల బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తుంది.

8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం. కెమెరాకు కూడా ఇందులో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కెమెరా క్లారిటీ విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో మంచి టచ్‌ అనుభూతి కోసం సూపర్‌ స్మూత్ అనుభూతితో పాటు శక్తివంతమైన టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను తీసుకొచ్చారు. ఈ కెమెరాతో 4కే రిజల్యూషన్‌ వీడియోను చిత్రీకరించవచ్చు. ఇక ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24000గా నిర్ణయించారు. ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..