Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Boltt: ఇది స్మార్ట్‌ ఫోన్‌ లాంటిదే.. కానీ స్మార్ట్‌ ఫోన్‌ కాదు. ఆ ఫీచర్‌తో వస్తున్న వాచ్‌..

ఫైర్‌ బోల్ట్‌ డ్రీమ్‌ పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ 4జీ లైట్‌ నానో సిమ్‌ సపోర్ట్‌ కలిగిన మొట్ట మొదటి రిస్ట్‌ వాచ్‌ ఇదే కావడం విశేషం. జనవరి 10వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఫైర్‌ బోల్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది...

Fire Boltt: ఇది స్మార్ట్‌ ఫోన్‌ లాంటిదే.. కానీ స్మార్ట్‌ ఫోన్‌ కాదు. ఆ ఫీచర్‌తో వస్తున్న వాచ్‌..
Fire Boltt Dream
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 06, 2024 | 11:10 AM

మారుతోన్న టెక్నాలజీతో పాటు వాచ్‌ల పనితీరు కూడా మాఉతోంది. ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం చూసుకోవడానికి ఉపయోగించే సాధానం కానీ ఎప్పుడైతే స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి వాచ్‌కి ఉన్న అర్థమే మారిపోయింది. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌తో ఏయే పనులైతే చేస్తున్నామో, వాచ్‌తోనూ చేసే రోజులు వచ్చేశాయ్‌.

ఫైర్‌ బోల్ట్‌ డ్రీమ్‌ పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. ఫైర్ బోల్ట్ నుంచి..  ఆండ్రాయిడ్‌ 4జీ లైట్‌ నానో సిమ్‌ సపోర్ట్‌ కలిగిన మొట్ట మొదటి రిస్ట్‌ వాచ్‌ ఇదే కావడం విశేషం. జనవరి 10వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఫైర్‌ బోల్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది.

ఈ స్మార్ట్ వాచ్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలాగే ఈ వాచ్‌ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లతో పాటు గేమింగ్‌ అప్లికేషన్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ వాచ్‌లో 320 x 386 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కూడిన 2.02 ఇంచెస్‌ స్క్రీన్‌ను అందించారు. డిస్‌ప్లే 600 నిట్‌ల బ్రైట్‌నెస్, 60Hz రిఫ్రెష్ రేట్‌‌తో వస్తుంది. క్వాడ్-కోర్ ఆర్మ్ కార్టెక్స్ A7MP SoC ప్రాసెసర్ ఈ వాచ్‌ సొంతం. ఇక ఇందులో 800mAh బ్యాటరీని అందించారు. నాన్‌స్టాప్‌గా ఉపయోగించినా 24 గంటలపాటు పనిచేస్తుంది.

అలాగే ఈ వాచ్‌లో.. హార్ట్ బీట్ రేట్‌, SpO2, ఫిట్‌నెస్ ట్రాకింగ్‌తో పాటు పలు రకాల స్పోర్ట్స్ మోడ్‌లు వంటివి ఉన్నాయి. Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీ, Google Play Storeకి యాక్సెస్‌ కూడా ఉంది. కేవలం గేమ్స్‌ ఓటీటీ మాత్రమే కాకుండా సోషల్‌ మీడియా సైట్స్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లతో పాటు షాపింగ్‌ యాప్స్‌, ఫుడ్‌ డెలివరీ యాప్స్‌కు సైతం ఈ వాచ్‌ సపోర్ట్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక స్మార్ట్ ఫోన్‌లాంటి స్మార్ట్‌ వాచ్‌. అలాగే ఈ వాచ్‌లో దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP67 రేటింగ్‌ను ఇచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..