Fire-Boltt Smartwatch: అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్‌ను బ్లాస్ట్ చేసిన ‘గ్రెనేడ్’.. చూస్తే వదలరంతే..
అత్యంత ధృడమైన రూపంతో పాటు స్మార్ట్ డిజైన్ తో ఈ వాచ్ ఆకట్టుకుంటోంది. దీని పేరు ఫైర్-బోల్ట్ గ్రెనేడ్ స్మార్ట్ వాచ్. ఈ వాచ్ లో 1.39-అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, అనేక హెల్త్, ఫిట్‌నెస్ మోడ్‌లు ఉన్నాయి.
మార్కెట్లో స్మార్ట్ వాచ్ లకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు అన్ని కంపెనీలు పోటీపడుతున్నాయి. అత్యాధునిక ఫీచర్లు, అల్ట్రా మోడ్రన్ లుక్ లో వాచ్ లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఫైర్ బోల్ట్ ఓ సరికొత్త స్మార్ట్ వాచ్ ను ఆవిష్కరించింది. అత్యంత ధృడమైన రూపంతో పాటు స్మార్ట్ డిజైన్ తో ఈ వాచ్ ఆకట్టుకుంటోంది. దీని పేరు ఫైర్-బోల్ట్ గ్రెనేడ్ స్మార్ట్ వాచ్. ఈ వాచ్ లో 1.39-అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, అనేక హెల్త్, ఫిట్‌నెస్ మోడ్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫైర్-బోల్ట్ గ్రెనేడ్ స్మార్ట్ వాచ్ ధర, లభ్యత..
ఫైర్-బోల్ట్ గ్రెనేడ్ స్మార్ట్ వాచ్ ప్రారంభ ధర రూ. 1,999గా ఉంది. ఇది ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో కూడా అందుబాటులో ఉంది. ఇది రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది మెటాలిక్, సిలికాన్ స్ట్రాప్ లతో వస్తోంది. మెటాలిక్ స్ట్రాప్‌తో కూడిన స్మార్ట్‌వాచ్ గోల్డ్, సిల్వర్ మరియు బ్లాక్ కలర్‌లలో వస్తుంది. సిలికాన్ స్ట్రాప్ లు కామో-బ్లాక్, కామో-గ్రీన్, ఆరెంజ్ గోల్డ్, గన్‌పౌడర్ బ్లాక్, గోల్డ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి.
ఫైర్-బోల్ట్ గ్రెనేడ్ స్మార్ట్ వాచ్ లుక్ ఇలా..
స్మార్ట్‌వాచ్ లో 1.39-అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేతో వృత్తాకార డయల్, సైడ్ ఎడ్జ్‌లో బటన్‌లను అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మిలిటరీ-గ్రేడ్ అంతా ధృడంగా, షాక్‌ప్రూఫ్ బాడీతో వస్తుందని కంపెనీ పేర్కొంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. అంతర్నిర్మిత స్పీకర్, మైక్రోఫోన్ ఉంటుంది.
హెల్త్ ఫీచర్లు..
ఫైర్-బోల్ట్ గ్రెనేడ్ కంపెనీ హెల్త్ సూట్‌ను కలిగి ఉంది. ఇది మహిళల ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడంతో పాటు, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మోనిటర్, ఆక్సిజన్ లెవెల్స్ తనిఖీ చేస్తుంది. ఇది సరికొత్త స్ప్లాష్ రెసిస్టెన్స్ తో వస్తుంది. వినియోగదారులను ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉంచడానికి 123 విభిన్న స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫైర్-బోల్ట్ గ్రెనేడ్ 350ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై ఒక వారం వరకు పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. కానీ మీరు బ్లూటూత్ కాలింగ్ ఉపయోగిస్తుంటే అది కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది.
కనెక్టివిటీ ఫీచర్లను గమనిస్తే ఈ స్మార్ట్‌వాచ్ వినియోగదారులను కెమెరా, సంగీతాన్ని నియంత్రించడానికి అనుమతిస్తుంది. వాయిస్ అసిస్టెంట్, స్మార్ట్ నోటిఫికేషన్‌లు, ఫైండ్ మై ఫోన్, బిల్ట్ గేమ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..