- Telugu News Photo Gallery Technology photos Tecno launching new smartphone Tecno pova 5g features and price details
Tecno Pova 5: టెక్నో నుంచి మరో స్టన్నింగ్ ఫోన్.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో సూపర్ ఫీచర్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం టెక్నో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. టెక్నో పోవా 5 పేరుతో తీసుకురానున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను తీసుకురానున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? దీని ప్రత్యేకతలాంటి విషయాలు మీకోసం..
Updated on: Jul 02, 2023 | 5:00 PM

టెక్నో సంస్థ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. టెక్నో పోవా 5 పేరతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఫోన్ ఎప్పుడు రానుందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ఫీచర్లకు సంబంధించి కొన్ని లీక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించారు.

అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ హీలియో జీ99 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో పని చేస్తుందని సమాచారం.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 10 వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని ఇవ్వనున్నారు. 21 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకత.

బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ధర, లాంచింగ్ తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.





























