- Telugu News Photo Gallery Technology photos Oneplus launching new smart phone Oneplus nord ce 3 features and price details
OnePlus Nord CE 3: వన్‌ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. దుమ్మురేపే ఫీచర్స్, ధర తక్కువే..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లాస్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 పేరుతో తీసుకురానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Jul 03, 2023 | 8:42 AM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో మంచి ఫీచర్స్‌ను అందించనున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.72 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్‌లో క్వాల్‌కం స్నాప్‌డ్రాన్ 782 ఎస్‌ఓపీ వంటి శక్తివంతమైన ప్రాసెసర్‌ను అందించారు.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్‌లో 256 జీబీ స్టోరేజ్‌తో పాటు 12 జీబీ వరకు ర్యామ్‌ను అందించనుంది. అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, వైఫై, యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

కెమెరా విషాయనికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 స్మార్ట్ ఫోన్‌లో 80 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ధర విషయానికొస్తే రూ. 25,000 నుంచి రూ. 28,000ల మధ్య ఉండే అవకాశం ఉంది.





























